లోకేష్ ని ఆటాడుకున్న రోజా



Want create site? Find Free WordPress Themes and plugins.

 

 ఎప్పుడు ఎలా ఏం మాట్లాడాలో కూడా తెలియని స్థితిలో ఉన్న లోకేష్.. అడ్డంగా బుక్కవుతున్నారు. తన మాటలతో స్వయంగా ఇమేజ్ ను డ్యామేజ్ చేసుకుంటున్నారు. అసందర్భమైన మాటలతో, అనాలోచిత వ్యాఖ్యలతో లేనిపోని చిక్కుల్లో పడుతున్నారు.  ‘మీ అందరికి అంబేద్కర్ వర్ధంతి శుభాకాంక్షలు’ అంటూ నోరు జారిన నారా లోకేష్ ను విపక్షం ఓ ఆట ఆడుకుంటోంది. తెలివితేటల్లో ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ను, అబద్దాల్లో సీఎంను నారా లోకేష్ మించిపోయారని వైసిపి ఎమ్మెల్యే  రోజా వ్యాఖ్యానించారు. బీకాంలో ఫిజిక్స్ ఉంటుందని చెప్పి నవ్వుల పాలైన టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తో నారా లోకేష్ ను పోల్చారు.  అబద్ధాలు చెప్పడంలో తండ్రి చంద్రబాబును మించిపోయారని విమర్శించారు. వర్థంతికి, జయంతికి తేడా తెలియకుండా , వర్థంతి శుభాకాంక్షలు చెప్పిన  మంత్రిని రాష్ట్ర ప్రజలపై చంద్రబాబు రుద్దారని ఆమె నిప్పులు చెరిగారు. ఎంతో అనుభవమున్న పార్టీ నేతలను పక్కనబెట్టి, పార్టీ మారిన వారికి, రాజకీయ అనుభవం లేని వారికి, ప్రజా సమస్యలపై అవగాహన లేని వారికి చంద్రబాబు పెద్ద పీట వేశారని  ఫైర్ అయ్యారు.

Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*