ఎన్‌టిఆర్ సినిమాకు రూ.30 కోట్ల టేబుల్ ప్రాఫిట్



Want create site? Find Free WordPress Themes and plugins.
మరో హీరో సినిమాతో పోగొట్టుకుంది.. తమ్ముడు చిత్రంతో దక్కించుకోబోతున్నాడట ఆ ప్రొడ్యూసర్ కమ్ హీరో… చిత్రీకరణ దశలోనే వున్న ఆ సినిమా అప్పుడే అన్నకు టేబుల్ ప్రాఫిట్ తెచ్చిపెడుతోందట…నిర్మాతగా కళ్యాణ్ రామ్ వరుస పరాజయాలతో వున్నాడు… భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ‘కిక్-2’ మూవీ.. ప్రొడ్యూసర్ గా కళ్యాణ్ కు భారీ నష్టాలనే మిగిల్చింది… ఇక ఆ తర్వాత పూరి దర్శకత్వంలో చేసిన ‘ఇజం’ కూడా నిర్మాతగా – హీరోగా కళ్యాణ్ కు ఆశించిన విజయాన్ని అందించలేదు… దీంతో తన హోప్స్ అన్నీ ఇప్పడు తమ్ముడు తారక్ తో చేస్తోన్న ‘జై లవ కుశ’ సినిమాపైనే పెట్టుకున్నాడు… అందుకు తగ్గట్టే.. ఆయనకు యంగ్ టైగర్ సినిమాతో ముఫ్ఫై కోట్ల టేబుల్ ప్రాఫిట్ రాబోతుందట…’జనతా గ్యారేజ్’ సక్సెస్ ఇచ్చిన ఊపుతో మంచి ఫామ్ లో ఉన్న ఎన్టీఆర్ నటిస్తున్న ‘జై లవ కుశ’ సినిమాకి భారీ బిజినెస్ ఆఫర్స్ వస్తున్నాయట… ‘జనతాగ్యారేజ్’ థియేట్రికల్ షేర్ 80 కోట్ల రూపాయలు కొల్లగొట్టింది కాబట్టి.. ఇప్పుడు ఈ తాజా చిత్రానికి అన్ని ఏరియాలు కలుపుకుని.. 80 కోట్లకు పైగానే థియేట్రికల్ ఆఫర్స్ వస్తున్నాయట… ఎంత తక్కువ వేసుకున్నా.. తారక్ సినిమాకి థియేట్రికల్ ప్లస్ శాటిలైట్ రైట్స్ కలుపుకుని.. 80 కోట్ల రూపాయలు రావడం అయితే పక్కా అంటున్నారు …ఇక ఈ సినిమాను 50 కోట్ల లోపే రూపొందించాలని.. చిత్రం ప్రి-ప్రొడక్షన్ సమయంలోనే భారీ కసరత్తు చేశాడట ప్రొడ్యూసర్… ఈ నేపథ్యంలో సినిమాలో ఎన్టీఆర్ సరసన.. స్టార్ హీరోయిన్స్ జోలికి పోకుండా రాశి ఖన్నా, నివేదా థామస్ లను కథానాయికలుగా ఎంపిక చేశాడట… మరోవైపు క్వాలిటీ అవుట్ పుట్ కోసం ఖర్చు పెట్టాల్సిన దగ్గర బాగానే ఖర్చు పెట్టిస్తున్నాడట.. ఏది ఏమైనా వరుస ప్లాఫులతో నిర్మాతగా నిరుత్సాహ పడిన కళ్యాణ్ కు.. ఇప్పుడు తమ్ముడు తారక్ సినిమా మంచి ఉత్సాహానిస్తోందన్నమాట… మరి కళ్యాణ్ ప్రాఫిట్ తో పాటు సక్సెస్ కూడా కొడతాడేమో చూద్దాం.. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*