పండ్ల రసమే జయలలిత మృతికి కారణమా…



Want create site? Find Free WordPress Themes and plugins.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతి పై నెలకొన్న అనుమానాలు ఇంకా తొలగలేదు. ఆమెకు విషం ఇచ్చి చంపారనే ప్రచారం అప్పట్లోనే తెరపైకి వచ్చింది. జయ స్నేహితురాలు శశికళనే ఇందుకు కారణమనే వార్త దుమారం రేపింది. తన నెచ్చలిని ఎందుకు చంపుకుంటానని శశికళనే ఖండించాల్సి వచ్చింది. జయలలిత మేనకోడలు దీప సైతం ఇదే తరహా ఆరోపణలు చేశారు. వాస్తవం ఏంటనేది ఇంకా బయట పడలేదు. కానీ తాజాగా మరో కొత్త ప్రచారం జరుగుతోంది. జయ మరణానికి పండ్ల రసమే కారణమనే ప్రచారం ఊపందుకుంది. అమ్మ జయలలిత సెప్టెంబర్ లో అపోలో ఆస్పత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ డిసెంబర్ లో ప్రాణాలు వదిలారు. ఒకటా…రెండా 72 రోజుల పాటు జయ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఈ రోజుల్లో జయను చూసేందుకు శశికళ వర్గం అనుమతించక పోవడం పలు సందేహాలకు తావిచ్చింది. ఆ తర్వాత పురుచ్చితలైవి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
         జయ ముందే చనిపోయినా ఆలస్యంగా మరణ వార్తను ప్రభుత్వం ప్రకటించిందనే విమర్శలు వచ్చాయి. తాను కోలుకుంటున్న దశలో డాక్టర్ల అనుమతి లేకుండా జయలలిత పండ్ల రసం తాగారు. అది ఆమె గుండెపోటుకు కారణమైందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. ఆ జ్యూస్ తాగేటప్పుడు డ్యూటీలో ఉన్న నర్సులు అభ్యంతరం పెట్టలేదంటున్నారు. ఆరోగ్యం తిరిగి పుంజుకోవడంతో జయ తీరును వారు పెద్దగా పట్టించుకోలేదట. అదే జయ మృతికి దారి తీసిందనే వార్త హల్ చల్ చేస్తోంది. జయలలితకు ఆసుపత్రిలో చికిత్స చేసినప్పటి విజువల్స్ ఏవీ ఇప్పుడు అందుబాటులో లేవు. ఆసుపత్రికి ఎవరు వచ్చినా సీసీ కెమెరాలో రికార్డు అవుతాయి. కానీ తాము ఎలాంటి ఆడియో, వీడియో రికార్డు చేయలేదంటోంది అపోలో ఆసుపత్రి యాజమాన్యం. ఇదే నిజమని నమ్మాలేమో. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*