ఆ టీడీపీ నేతలకు వార్నింగ్



Want create site? Find Free WordPress Themes and plugins.
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఏం జరుగుతుంది. తొలిగా హెచ్చరిస్తారు. అప్పటికీ దారికి రాకపోతే వేటు వేస్తారు. ప్రస్తుతం టీడీపీలో ఉన్న కీలక నేతలు నలుగురికి పార్టీ అధినేత నుంచి వార్నింగ్ వచ్చిందంటున్నారు. క్రమశిక్షణ ఉల్లంఘించిన నేతల పై వేటు వేయాలని పార్టీ అధినేత, సి.ఎం చంద్రబాబునాయుడు నిర్ణయించుకున్నారట. అందుకే ముందస్తుగా కొందరికీ వార్నింగ్ లు వెళ్లాయనే చర్చ సాగుతోంది. 
టీడీపీ ఎంపీ శివ ప్రసాద్ ఇప్పటికే ధిక్కార స్వరాన్ని వినిపించారు. టీడీపీ హయంలో ఎస్సీ, ఎస్టీలకు తగినంత న్యాయం జరగడం లేదన్నారు. ఇది తెలుగు తమ్ముళ్లల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆ నేత పై వేటు వేస్తే వెనుకబడిన వర్గాల నుంచి వ్యతిరేకత వస్తుందని తటపటాయిస్తున్నారట. ఈ లోపు సి.ఎం రమేష్, సుజనా చౌదరి వంటి వారితో మాట్లాడించినా ఆశించినంత ప్రయోజనం నెరవేరలేదట. ఆయనే కాదు…మాజీ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి అసంతృప్తి జ్వాలతో రగిలిపోతున్నారు. మంత్రి పదవి నుంచి తొలగించడమే ఇందుకు కారణం. వారే కాదు… ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి వంటి వారి పేర్లు పరిశీలనలో ఉన్నాయంటున్నారు. 
గుంటూరు జిల్లా పొన్నూరు నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన తనకు మంత్రి అయ్యే అర్హత లేదాయని ధూళిపాళ్ల అనుచరుల ముందు వాపోయిన సంగతి తెలిసిందే. సంగం డెయిరీ ఛైర్మన్ గా ధూళిపాళ్ల ఉన్నంత వరకు ఆయనకు మంత్రి పదవి రాదనే చర్చ ముందే నడిచింది. ఆదాయం వచ్చే మంచి పదవి ఉండగా..మంత్రి పదవి ఎందుకనే ఆలోచనతోనే నరేంద్రను పక్కన పెట్టారనే వాదన వచ్చింది. అదొక్కటే కాదు..సామాజిక వర్గ పరంగా చూస్తే ధూళిపాళ్లకు చోటు ఇవ్వడం కష్టమైందని ఇటు చంద్రబాబుతో పాటు..అటు చినబాబు లోకేష్ అన్నారంటారు.  వాస్తవం ఏంటనేది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*