స‌మ్మ‌ర్ రేసులో బోయ‌పాటి..?



Want create site? Find Free WordPress Themes and plugins.
యాక్ష‌న్ చిత్రాల‌ను నిర్మించ‌డంలో బోయ‌పాటి త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నారు. స‌రైనోడు తో విజ‌యం అందుకున్న ఆయ‌న ప్ర‌స్తుతం బెల్లంకొండ సురేష్ కుమారుడు శ్రీనివాస్ తో సినిమా తెర‌కెక్కిస్తున్నారు. భారీ బ‌డ్జెట్‌తో నిర్మిత‌మ‌వుతున్న ఈ మూవీ హైద‌రాబాద్ షెడ్యూల్‌తో దాదాపు పూర్త‌వ్వ‌డానికి వ‌చ్చింది. సినిమా పోస్ట‌ర్లు, షూటింగ్ సీన్‌లు బ‌య‌ట‌కు రాకుండా జాగ్ర‌త్త ప‌డ్డ దర్శకుడు సినిమాను వేస‌వి వినోదాల జాబితాలో చేర్చే ప‌నిలో ప‌డ్డారు. ఎలాగైన మే చివ‌ర లేదా జూన్ మొద‌టి వారంలో విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్న‌ట్టు ఫిలింన‌గ‌ర్‌లో ప్ర‌చారం జ‌రుగుతుంది. షూటింగ్ స‌మ‌యంలో కొన్ని ఇబ్బందులు ఎదురైన‌ప్ప‌టికి మొత్తానికి తుదిద‌శ‌కు చేర‌డంతో వేస‌వి కానుకగా తీసుకువ‌చ్చేందుకు నిర్ణ‌యించుకున్నారు. శరత్ కుమార్.. జగపతిబాబు.. రకుల్ ప్రీత్ సింగ్.. ప్రగ్యా జైశ్వాల్.. ఇలా భారీ తారాగణమే ఉంది. ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్నందిస్తున్నారు. మ‌రి శ్రీ‌నివాస్ ఈ సినిమాతో ప్రేక్ష‌కుల మ‌దిని దోచుకుంటాడో లేదో తెలియాలంటే రెండు నెల‌లు ఆగాల్సిందే…
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*