ప్ర‌త్యేక హోదా పై నిప్పులు చెరిగిన  ప‌వ‌న్‌Want create site? Find Free WordPress Themes and plugins.
ఏపీ ప్ర‌త్యేక హోదా పై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా విమ‌ర్శ‌నాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా ట్విట్ట‌ర్ వేదిక‌గా సంచ‌న‌ల వాఖ్య‌లు చేశారు. బీజేపీ, టీడీపీల‌తో త‌ప్పులంటూ ప‌రోక్షంగా ల‌క్ష్యం చేసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఓ వైపు ప్ర‌భుత్వాల‌ను విమ‌ర్శిస్తూ మ‌రో వైపు వైసీపీ, టీఆర్ఎస్ విష‌యంలో సానుకూలంగా స్పందించారు. ప్ర‌త్యేక హోదాకు సంబంధించి చ‌ర్చ వ‌చ్చిన సమ‌యంలో మంత్రి అశోక‌గ‌జ‌ప‌తిరాజు నిశ‌్శబ్దంగా ఉండ‌టం, టీడీపీ ఎంపీలు గైర్హాజ‌రు కావ‌డం దురదృష్ట‌క‌రం. టీడీపీకి స్సెష‌ల్ స్టేట‌స్ అంశంపై రాజీప‌డడానికి హ‌క్కు లేద‌ని, ఈ విషయంలో టీడీపీ, బీజేపీలు ఆంద్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల్లో ప్ర‌త్యేక హోదా తీసుకొస్తాయ‌న్న నమ్మకం క‌ల్పించి అధికారంలోకి వ‌చ్చాయంటూ వ్యాఖ్యలు చేశారు. ఇక ప్ర‌త్యేక హోదా విష‌యంలో తెలంగాణ ఎంపీలు కేశ‌వ‌రావు, రాపోలు ఆనంద్‌భాస్క‌ర్లు పార్ల‌మెంటులో మ‌ద్ద‌తునివ్వ‌డాన్ని తాను మ‌న‌స్పూర్తిగా స్వాగ‌తిస్తున్న‌ట్లు తెలిపారు. వైస్సార్‌సీపీ ఎంపీలు ప్ర‌త్యేక హోదా విష‌యంలో చేస్తున్న పోరాటాన్ని ఆయ‌న అభింనందించారు. ఇక రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో ఉత్త‌రాది ఎంపీలు మ‌న ఎంపీల‌పై చేయి చేసుకున్న విష‌యాన్ని టీడీపీ ఎంపీలు మ‌రిచిపోయి ఉంటార‌ని ఆయ‌న ఘాటుగా స్పందించారు. మీ వ్య‌క్తిగత అవ‌స‌రాల కోసం కేంద్రం వ‌ద్ద ప్ర‌జ‌ల ఆత్మ‌గౌర‌వాన్ని తాక‌ట్టు పెట్ట‌వ‌ద్ద‌ని ప‌వ‌న్ టీడీపీపై నేరుగా విరుచుకుప‌డ్డారు. ఈ విష‌యంలో నేను చాలా నిగ్ర‌హాన్ని చూపించాను. కేంద్రంతో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని అంగీక‌రిస్తున్నాను. కాని మ‌ళ్లీ, మ‌ళ్లీ అదే అన్యాయాన్ని ఎదుర్కొంటున్న‌ప్పుడు ఈ నిగ్ర‌హం అవ‌స‌ర‌మా అని ప‌వ‌న్‌ తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. ప్ర‌జ‌లు కోరుకుంటున్నార‌ని ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ను విభ‌జిస్తారా..?, లేదంటూ రూల్ డౌన్ ఆంద్ర‌ప్ర‌దేశ్‌కే వ‌ర్తిస్తుందా అంటూ కేంద్ర వైఖ‌రిపై నిప్పులు చెరిగారు. ఇక ఢిల్లీలో రాజ‌కీయంగా మ‌న పట్ల‌ వైఖ‌రి ఎలా ఉందంటే.. మా రంగు గురించి మాట్లాడినా ప‌ర్వాలేదు అనుకున్నాం.., మా ద్ర‌విడ భాష గురించి మాట్లాడినా ఊరుకున్నాం.., పార్ల‌మెంటులో కొట్టినా, తిట్టినా, మ‌మ్మల్ని వేరుచేసినా స‌హించాం.., అంటూ ప‌వ‌న్ త‌న‌దైన శైలిలో కేంద్ర వైఖ‌రిపై తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు.
Did you find apk for android? You can find new Free Android Games and apps.Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*