మరో హిస్టారికల్ సబ్జెక్ట్ పై బాలకృష్ణ ఆసక్తి…? 



Want create site? Find Free WordPress Themes and plugins.
పూరి జగన్నాథ్ మూవీ షూటింగ్ తో బిజీ అయిన బాలకృష్ణ… నెక్స్ట్ మూవీ ఎవరితో చేస్తారనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే.. బాలకృష్ణ సినిమా విషయంలో తాజాగా హిస్టారికల్ సబ్జెక్ట్ ఒకటి తెరపైకి వచ్చింది. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమా తర్వాత.. హిస్టారికల్ సినిమాలకు కాలం చెల్లిపోలేదన్న విషయం నిరూపితమైంది. అంతేకాదు.. ఈ తరహా చిత్రాలకు బాలకృష్ణ పూర్తి స్థాయిలో న్యాయం చేయగలడని ప్రూవ్ అయింది. ఈ నేపథ్యంలో బాలయ్యతో చారిత్రక చిత్రాలు తెరకెక్కించే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. మరోవైపు.. ఆల్రెడీ ఎన్టీఆర్ జీవితం ఆధారంగా ఓ సినిమా చేయబోతున్నట్టు ప్రకటించిన బాలకృష్ణ… మరోవైపు ఓ హిస్టారికల్ సబ్జెక్ట్ పై కూడా ఆసక్తి చూపిస్తున్నారనే ప్రచారం సాగుతోంది.  జర్మనీలోని డచెస్ హిస్టారిచెస్ మ్యూజియంలో… 1900 సంవత్సరానికి ముందు చెక్కిన రాజులు, నియంతలు, శాస్త్రవేత్తల శిల్పాలు, వారు ఉపయోగించిన దుస్తులు, ఆయుధాలు, సామాగ్రి వంటివి ప్రదర్శనకు ఉన్నాయి. ఓ సారి ఈ మ్యూజియంను సందర్శించిన బాలకృష్ణకు… ఆ శిల్పాల్లో ఒకటి అమితంగా ఆకట్టుకుందట. అందుకు కారణం.. అది గోదావరి ప్రాంతానికి చెందిన శాస్త్రి అనే శాస్త్రవేత్తది కావడమే. అంతగా ఆధారాలు లేని ‘శాతకర్ణి’ కథలో నటించిన బాలకృష్ణకు.. ఈ శాస్త్రి జీవితాన్ని సినిమాగా తెరకెక్కించాలనే ఉత్సూకత కలిగిందట. దీంతో.. మన తెలుగు వారికే తెలియని.. ఆ తెలుగు శాస్త్రవేత్త ఎవరనే విషయంపై పరిశోధనలు చేయిస్తున్నారట. ప్రస్తుతానికి ప్రచారంలో మాత్రమే ఉన్న ఈ ప్రాజెక్ట్ పై నిజానిజాలు తెలియాలంటే.. మరికొద్దిరోజులు ఆగాల్సిందే..!
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*