నంద్యాల ఉప ఎన్నికలో వైసీపీ తంటాలు…



Want create site? Find Free WordPress Themes and plugins.
దమ్ముంటే ఎన్నికలకు పోదాం… సవాలు విసిరే జగన్ మోహన్ రెడ్డికి నంద్యాల ఉప ఎన్నికల భయం పట్టుకుంది. సీటు మాదే గెలుపు మాదేనని మేక పోతు గాంభీర్యం ప్ర‌ద‌ర్శించిన జ‌న‌గ్‌ ఇప్పుడు నంద్యాల నుంచి ఎవరిని బరిలో నిలపాలి అనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నాడు. ఉప ఎన్నికల్లో పోటీచేయడానికి పార్టీ నుంచి జిల్లా నేతలెవ్వరూ ముందుకు రాకపోవడంతో దిక్కుతోచని స్థితిలో జగన్ ఉన్నట్లు తెలుస్తుంది… పార్టీని నమ్ముకొని 8 సంవాత్సరాలుగా అధికారానికి దూరంగా ఉండటంతో పార్టీ నేతలంతా ఆర్ధికంగా చితికి పోయి ఉన్నట్లు జిల్లా నేతలు జగన్ తో చెప్పినట్లు సమాచారం.. పైగా పార్టీ కార్యక్రమాలు చేస్తుండడంతో అప్పులు తెచ్చి చేయాల్సి వస్తుందని జగన్ ముందు నేతలు మొరబెట్టుకున్నట్లు సమాచారం… గౌరు వెంకట్ రెడ్డి కూడా నంద్యాల ఉప ఎన్నిక బరిలో నిలిచేందుకు నిరాకరించినట్లు సమాచారం.. దీంతో ఎన్నికల బరిలో పార్టీ నుంచి పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో జగన్ పక్క చూపులు చూస్తున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది… టీడీపీలో సీటు ఆశించి బంగ పడ్డవారిని తమ పార్టీలో చేర్చుకుని సీటు ఇస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నట్టు పార్టీ నేతలు అంటున్నారు… భూమా నాగిరెడ్డి కుటుంబానికి టీడీపీ నంద్యాల సీటు కేటాయిస్తే శిల్పా మోహన్ రెడ్డి పార్టీని వీడి తమ పార్టీలోకి వస్తారని  వైసీపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.. అందుకే ఉప ఎన్నికల్లో అభ్యర్థిని జగన్ ఇంకా ఖరారు చేయలేదని పార్టీ నేతలు అంటున్నారు… గతంలోనూ శిల్పా బ్రదర్స్ తమ పార్టీలోకి వస్తున్నట్లు వైసీపీ నేతలు ప్రచారం చేయడం తెలిసిందే… ఇప్పుడు మళ్లీ అదే ప్రచారం చేస్తుండడంతో భవిష్యత్తులో ఏం జరుగుతుందా అని ఆసక్తి నెలకొంది….
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*