దర్శకుడికి చుక్కలు చూపిస్తున్న కత్రినా



Want create site? Find Free WordPress Themes and plugins.
బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ ప్రస్తుతం పోస్ట్ బ్రేక్ అప్ డిప్రెషన్ లో బాగా కూరుకుపోయినట్లుంది. మరోవైపు క్యాట్ సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయడంలేదు. దీంతో మరింత హర్ట్ అయిన బ్యూటీ… బొత్తిగా ప్రొఫెషనలిజాన్ని పట్టించుకోవడం లేదు. దీంతో అమ్మడితో కమిట్ అయిన దర్శక-నిర్మాతలకు తలబొప్పి కట్టేస్తోంది. ఇన్నాళ్లూ కత్రినా వర్క్ కమిట్మెంట్ కు మురిసిపోయిన సినీ జనాలు సడన్ గా అమ్మడిలో వచ్చిన మార్పుకు ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా ‘జగ్గా జాసూస్’ డైరెక్టర్ అనురాగ్ బసు అమ్మడి ప్రవర్తనతో విసుగెత్తిపోతున్నాడట. మూడేళ్ల క్రితం ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పుడు పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్న రణ్ బీర్, కత్రినా… షూటింగ్ మధ్యలో గొడవపడి బ్రేక్ అప్ చెప్పేసుకున్న సంగతి తెలిసిందే…వీరిద్దరూ ఒకరి ముఖం మరొకరు చూసుకునేందుకే ఇష్టపడని సమయంలో అతికష్టం మీద అనురాగ్ ఈ మూవీని పూర్తి చేశాడు. ఇక ఈ సినిమాలో రణ్ బీర్ ను ముద్దాడే సీన్ ను తొలగించమని దర్శకుడిని డిమాండ్ చేస్తున్న క్యాట్… అలా అయితేనే ప్యాచ్ వర్క్ పూర్తి చేస్తానని బెదిరింపులకు సైతం దిగుతోందట. ఇక ఈ సినిమాకోసం వ్యయప్రయాసలు కోర్చిన అనురాగ్… విధిలేని పరిస్థితుల్లో అమ్మడి డిమాండ్స్ కు తలొగ్గినట్లు తెలుస్తోంది. మరి.. కత్రినా కటింగ్ లు ఇంకెన్నాళ్లు సాగుతాయో చూడాలి.   
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*