యోగిని ట్రంప్‌తో పోల్చుతారా!



Want create site? Find Free WordPress Themes and plugins.

యోగి ఆదిత్యానాథ్‌. యూపీ సీఎంగా త‌న రూటే స‌ప‌రేట్ అంటూ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నారు. కాషాయనేత‌గా ముద్ర వేసుకుంటున్నారు. భావి ప్ర‌ధానిగా ఇప్ప‌టికే చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాడు. అటువంటి యోగిను అమెరికా న‌యా అధ్య‌క్షుడు ట్రంప్‌తో పోల్చుతూ కోల్‌క‌తాలోని యూనివ‌ర్సిటీలో ఏర్పాటుచేసిన బ్యాన‌ర్లు క‌ల‌క‌లం రేకెత్తిస్తున్నాయి. వెస్ట్ బెంగాల్ లోని ప‌లు విద్యాసంస్థ‌ల్లోనూ ఇదే విధ‌మైన పోస్ట‌ర్లు వెలిసిన‌ట్లు పోలీసులు గుర్తించారు. జాదవ్‌పూర్‌ విశ్వవిద్యాలయంలో ఓ వ‌ర్గం.. ఆర్ ఎస్ ఎస్‌, యోగి ఆదిత్యానాథ్‌కు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. ప‌నిలో ప‌నిగా ‘ఆదిత్యనాథ్‌.. ఓ కొత్త ట్రంప్‌’ అని రాసి ఉన్న ప్లకార్డులతో నిర‌స‌న తెలియ‌జేశారు. నాగాలాండ్‌, మిజోరాం, జమ్ము కశ్మీర్‌ల‌కూ స్వాతంత్య్రం కావాలని నినాదాలు చేశారు. దీంతో స్థానికంగా కలకలం రేగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనపై విచారణ చేపడతామన్నారు.

Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*