ఆ ఇద్ద‌రు మ‌రోసారి…Want create site? Find Free WordPress Themes and plugins.
మోహన్ లాల్, ప్రకాశ్ రాజ్.. ఈ ఇద్దరి కాంబినేషన్ అనగానే… మణిరత్నం తెరకెక్కించిన ‘ఇద్దరు’ సినిమా కళ్లముందు కదులుతుంది. ఈ సినిమా వచ్చి రెండు దశాబ్ధాలు కావస్తోన్నా.. ఈ ఇద్దరి కాంబినేషన్ లో మరో సినిమా రాకపోవడం విశేషం…. దక్షినాది నాలుగు భాషలతో పాటు హిందీలోనూ పలు చిత్రాల్లో నటించిన ప్రకాశ్ రాజ్, మోహన్ లాల్ సినిమాలో మాత్రం మరోసారి నటించకపోవడం ఆశ్చర్యం కలిగించక మానదు…. అయితే అతి త్వరలో ఈ కాంబినేషన్ రిపీట్ కాబోతోంది… ఇరవై ఏళ్ల విరామం తర్వాత ఈ ఇద్దరు మరోసారి కలసి నటించబోతున్నారు… ‘ఒడియన్’ పేరుతో తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో మోహన్ లాల్ కు జంటగా మంజు వారియర్ నటించనుంది… ప్రకాశ్ రాజ్ మోస్ట్ పవర్ ఫుల్ విలన్ రోల్ లో నటించబోతున్నాడు… యాడ్ ఫిల్మ్ మేకర్ శ్రీకుమార్ మీనన్ దర్శకత్వం వహించబోతున్న ఈ సినిమాలో బాలీవుడ్ లీడింగ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ.. కీలకపాత్ర పోషించనున్నాడు… మే 25 నుంచి ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లబోతోంది… పీటర్ హెయిన్స్ ఫైట్స్ సమకూర్చనున్న ఈ మూవీ యాక్షన్ ప్యాక్ డ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించబోతున్నట్టు దర్శకుడు శ్రీకర్ తెలియజేశారు… 20 ఏళ్ల తర్వాత మోహన్ లాల్ చిత్రంలో నటించడమే కాదు ప్రకాశ్ రాజ్ మలయాళ సినిమాలో నటించి కూడా ఏడేళ్లు అవుతోంది… మరి ఈ సినిమా తర్వాత ప్రకాశ్ రాజ్ మాలీవుడ్ లోనూ బిజీ అవుతాడేమో చూడాలి..!
Did you find apk for android? You can find new Free Android Games and apps.Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*