దిగివ‌చ్చిన  కాగిత‌ వెంక‌ట్రావు



Want create site? Find Free WordPress Themes and plugins.
మంత్రి పదవీ ఇవ్వకపోవడంతో అసంతృప్తితో ఉన్న కాగిత వెంకట్రావ్ ను బుజ్జగించేందుకు కళా వెంకటరావు, మంత్రి దేవినేని ఉమా చంద్రబాబు వద్దకు తీసుకెళ్లారు.  ఏయే కారణాల వల్ల మంత్రి పదవి ఇవ్వలేకపోయాం అనే విషయాన్ని ముఖ్యమంత్రి కాగిత కు వివరించారు. భవిష్యత్ లో  పూర్తి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.. అనంతరం వారు మాట్లాడుతూ… మంత్రులుగా కొందరిని తీసుకోవాలని మనసులో ఉన్నా తీసుకొలేని పరిస్థితి ఉందని, 2004లో రాజ్యాంగ సవరణ ప్రకారం కేవలం 15 శాతం మందికి మాత్రమే మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉందని చెప్పారు.. అసంతృప్తులు అన్ని సర్దుకుంటున్నాయని, నిన్న వేడి ఈరోజు లేదని అన్నారు.. అసంతృప్తి అనేది టీ కప్పులో తుఫాన్ లాంటిదని అన్నారు. కాగిత పార్టీకి విధేయుడిగా నమ్మకస్తుడిగా పనిచేశారని కళా వెంకట్రావ్ అన్నారు. వెంకటరావు మాట్లాడుతూ.. కొన్ని కారణాల వల్ల ఇవ్వలేక పోయాను అని చంద్రబాబు చెప్పారని అన్నారు. మంత్రి పదవి ఇవ్వకపోవడం పట్ల కార్యకర్తలు కొంత ఇబ్బంది పడ్డారని, అందుకే బాబు ను కలిశానని అన్నారు. పార్టీ అబివృద్ధి కోసం కృషి చేస్తానని చెప్పారు..
⁠⁠⁠⁠
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*