ప‌వ‌న్‌తో బండ్ల గ‌ణేష్ చిత్రం



Want create site? Find Free WordPress Themes and plugins.
వరుస సినిమాలతో జోరు మీదున్న పవన్ కళ్యాణ్… వచ్చే ఎన్నికలలోపు సాధ్యమైనన్నీ ఎక్కువ సినిమాల్లో నటించాలనే ఉద్దేశంతో ఉన్నాడని సినీ వర్గాల్లో టాక్… త్వరలో త్రివిక్రమ్ డైరెక్షన్ లో నటించబోతున్న పవన్.. ఆతరువాత ఎ.ఎం.రత్నం నిర్మాణంలో రూపొందబోయే సినిమాలో నటిస్తాడని సమాచారం… అయితే పవన్ తో మూడోసారి సినిమా నిర్మించే ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్న నిర్మాత బండ్ల గణేశ్… ఈ మధ్య మళ్లీ పవన్ కు సన్నిహితంగా కనిపిస్తుండటంతో ఈ కాంబినేషన్ వర్కవుటయ్యే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు పవర్ స్టార్ తో రూపొందించబోయే సినిమా కోసం దర్శకుడిని ఎంపిక చేసుకునే పనిలో ఉన్న బండ్ల గణేశ్… ఆ అవకాశం కోసం ఎదురుచూస్తున్న వినాయక్ తో కలిసి సినిమా ప్లాన్ చేయబోతున్నట్టు టాలీవుడ్ లో సరికొత్త ఊహాగానాలు వినిపిస్తున్నాయి… చిరంజీవితో ‘ఖైదీ నంబర్ 150’ సినిమాను తెరకెక్కించిన తరువాత మరో పెద్ద హీరోతో సినిమా చేయాలనే ఆలోచనతో ఉన్న వినాయక్… పవన్ తో సినిమా చేసే ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నాడని వార్తలు వినిపించాయి. మాస్ సినిమాలను తనదైన స్టయిల్లో తెరకెక్కించే వినాయక్, పవన్ కాంబినేషన్ కుదిరితే… అది క్రేజీ కాంబినేషన్ అవుతుందని భావించిన బండ్ల గణేశ్… ఇందుకోసం ప్రయత్నాలు మొదలుపెట్టాడని సినీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది…  బండ్ల గణేశ్ ప్రయత్నాలు సక్సెసయితే అది వినాయక్ కు ఎంతగానో కలిసొచ్చే విషయమే అవుతుందని చెప్పొచ్చు. దీనిపై పుల్  క్లారిటీ రావాలంటే మరి కొంత కాలం అగాల్సిందే…
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*