జగన్ ఛాలంజ్ ను స్వీక‌రిస్తాడా..!



Want create site? Find Free WordPress Themes and plugins.

ఏపీ అసెంబ్లీలో అధికార పక్షం నేతలు చేసిన ఛాలంజ్ కి జగన్ ఎందుకు ఒప్పుకోవడం లేదు.. మంత్రి పుల్లారావుకు సంబంధం ఉందని చెప్పి ఇరుకున పడ్డారా.. తన వద్ద ఉన్న ఆధారాలపై ఆయనకే నమ్మకం లేదా… అగ్రి గోల్డ్ వ్యవహారంలో మంత్రి పాత్ర పై జ్యుడిషరి విచారణ జరిపించాలని అడిగి.. వెంటనే వెనక్కు తగ్గడానికి కారణం ఏమిటి…? అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రెండు రోజులుగా అగ్రి గోల్డ్ వ్య‌వ‌హారం సభను కుదిపేసిన విషయం తెలిసిందే.. గత ఏడాది ఇదే అంశంపై చర్చ జరిగి సవాళ్లు ప్రతి సవాళ్లు జరగగా మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి ఇదే అంశాన్ని సభ ముందుకు తీసుకు రావడంతో నిరూపించ‌మని ప్రభుత్వం గట్టిగా పట్టుబట్టడం.. చ‌ట్ట ప‌రంగా  విచారణ జరిగితే నిజానిజాలు బయటకు వస్తాయని డిమాండ్ చేయడం.. దానికి సీఎం ఓకే అనడంతో సభలో హైడ్రామా మొదలైంది. విచారించాలని ప్రతిపక్ష డిమాండ్ కు.. నిరూపిస్తే పుల్లారావు రాజీనామా చేస్తాడని.. లేదంటే జగన్ రాజీనామా చేస్తారా అని టీడీపీ సవాల్ విసరడంతో ప్రతిపక్షనాయకుడు వెనక్కితగ్గాడు.. నిజానికి తనవద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయి. 20 నిమిషాలు సమయం ఇస్తే ఆధారాలు సభ ముందు ఉంచుతా అని చెప్పి ఎందుకు స్వీకరించడం లేదు అనేది ఆపార్టీ నేతల‌కే అర్ధం కాని ప‌రిస్థితి.. తన వద్ద ఉన్న ఆధారాలపై తనకే నమ్మకం లేక చాలంజ్ కు ఒప్పుకోవడం లేదు అనే భిప్రాయం చాలా మంది నాయకులు ఆఫ్ ది రికార్డు వ్యక్తం చేశారు కూడా.. తన వద్ద ఉన్న ఆధారాలు అగ్రి గోల్డ్ బాధితులు ఇచ్చినవే అని ఆయనే పదే పదే మీడియా ముందు చెప్పడం.. నమ్మకంలేకనేనని.. అందుకే చాలంజ్ కి ఒప్పుకోవడం లేదు అని విశ్లేషకులు అంటున్నారు. మొత్తానికి అగ్రి గోల్డ్ వ్యవహారంతో సభలో అడ్డంగా దొరికి పోయాడని ప్రభుత్వం అంటుంటే..  జ‌గ‌న్ మాత్రం స్పీక‌ర్ పై అవిశ్వాస తీర్మానం పెడతామని చెప్ప‌డం విడ్డూర‌మే మరి…

Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*