కాటమరాయుడు : సమీక్షWant create site? Find Free WordPress Themes and plugins.

చిత్రం : కాటమరాయుడు
రేటింగ్‌ : 3.25/5
నటీనటులు : పవన్‌ కల్యాణ్‌, శ్రుతిహాసన్‌, నాజర్‌, ఆలీ, శివబాలజీ, అజయ్‌, చైతన్య కృష్ణ, తరుణ్‌అరోరా, రావు రమేష్‌, ప్రదీప్‌ రావత్‌, కమల్‌ కామరాజు తదితరులు
కూర్పు : గౌతంరాజు
ఛాయాగ్రహణం : ప్రసాద్‌ మూరెళ్ల
సంగీతం : అనూప్‌ రూబెన్స్‌
నిర్మాత : శరత్‌ మరార్‌
దర్శకత్వం : డాలీ
హిట్‌, ప్లాప్‌లతో సంబంధం లేకుండా క్రేజ్‌ఉన్న హీరో పవన్‌.. మరి ఆయన సినిమా వస్తుందంటే అభిమానులకు.. ఒక దసరా.. ఒక సంక్రాంతి వచ్చినట్లే.. తమిళంలో భారీ విజయం సాధించిన వీరంను స్ఫూర్తిగా తీసుకుని తెరకెక్కిన ‘కాటమరాయుడు’పై చాలానే ఆశలు పెట్టుకున్నారు. ఫస్ట్‌లుక్‌ నుంచి మొదలైన క్రేజ్‌.. టీజర్‌.. ట్రైలర్‌ విడుదలయ్యే సరికి అంచనాలు భారీగా పెరిగిపపోయాయి.. మరి వేసవి సినీ సంబరాలు మొదలవకుండానే ప్రేక్షకుల ముందుకొచ్చిన పవర్‌స్టార్‌ మూవీ ఎలా ఉందో సమీక్షిద్దామా..
కథ..
సీమలో తనకంటూ ప్రత్యేకత చాటుకున్న కాటమరాయుడు(పవన్‌) న్యాయంవైపు నిలబడతాడు.. ఆయన మాటే శాసనంగా ఆయన నలుగురు తమ్ముళ్లు అమలు చేస్తారు. కష్టం ఊరికొచ్చినా.. వ్యక్తికొచ్చిన రాయుడు ఒకే స్పందన.. అంత పేరు సంపాదించిన కుటుంబంలో ఆడవారికి చోటే లేకుండా ఉంటుంది.. అన్న మాట కోసం తమ్ముళ్లు, స్నేహం కోసం లింగ(ఆలీ) ప్రేమలో ఉన్నా పెళ్లివైపు వెళ్లలేదు.. వారికి కల్యాణ యోగం కలగాలంటే కాటమరాయుడిని ప్రేమలో పడేయాలి అని ప్రారంభమైన ప్రయత్నాలతో శ్రుతిహాసన్‌తో దగ్గరయ్యేలా పథకాలు వేస్తుంటారు.. ఆ తరవాత వాళ్లేలా దగ్గరయ్యారు.. మరోవైపు రాయుడి శత్రువులు పగతీర్చుకోవడానికి చేసే ప్రయత్నాలను ఎలా తిప్పికొట్టాడు.. ఆ తరవాత కథనాయకి కుటుంబానికి ఎలా అండగా నిలబడ్డాడు అనేది కథాంశం..
విశ్లేషణ..
రాయుడు సీన్‌లోకి వచ్చింది మొదలు పతాక సన్నివేశం వరకు కథ, కథనం ఒక పట్టుతో సాగేలా దర్శకుడు డాలీ శ్రద్ధ తీసుకున్నాడు. తమిళ మాతృక వీరంలోని సహజత్వాన్ని ఎక్కడ తగ్గించకుండా.. పవన్‌ ఇమేజ్‌ని దృష్టిలో ఉంచుకుని చాలా బాగా తెరకెక్కించాడు.. కెమెరా పనితనం చాలా బావుంది.. ప్రతి సీన్‌ చాలా అందంగా చిత్రీకరించగలిగారు.. బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ కథకు బాగా సెట్‌ అయ్యింది.. పాటలు ప్రజాధరణ పొందిన తరహాలోనే వెండితెరపైనా బాగా వచ్చాయి.. గబ్బర్‌సింగ్‌ జంటకు ఇప్పటికే మంచి క్రేజ్‌ ఉండటం.. పవన్‌ కొత్తలుక్‌, శ్రుతిహాసన్‌ అందాలతో పాటలు సినిమాకు బలంగా మారాయి.. రాయుడి తమ్ముళ్లుగా చేసిన యువ హీరోలు ప్రతి ఒక్కరు తమ పాత్రలకు న్యాయం చేశారు.. సందర్భానుసారంగా మాటలు రాయడం చాలా బావుంది.. పంచ్‌లు కూడా బాగా పేలాయ్‌.. ఎప్పటి లాగే ఆలీ.. పవన్‌తో చేసే అల్లరి బాగా వర్క్‌అవుట్‌ అయ్యింది.. థియేటర్‌లోకి కాలుపెట్టింది మొదలు బాగా అల్లరి చేసే అభిమానులు సైతం సినిమాలో లీనమైపోవడం గమనించొచ్చు.. పవన్‌ కొత్త గెటప్‌తోపాటు కొన్ని సన్నివేశాలు ఆయన మనసు పెట్టి చేయడంతో చాలా సహజంగా వచ్చాయి.. ముఖ్యంగా లవ్‌ సన్నివేశాలలో కెమెస్ట్రీ బాగా వర్క్‌అవుట్‌ అయ్యింది.
ప్లస్‌పాయింట్స్‌
+ పవన్‌ నటన, హావభావాలు
+ మాటలు, తమ్ముళ్ల నటన
+ లవ్‌ట్రాక్‌, ప్రధమార్థం
+ సన్నివేశాల్లో ఇమిడిపోయినా కామెడీ
మైనస్‌ పాయింట్స్‌
– నెమ్మదిగా సాగే ద్వితీయార్థం, వర్క్‌అవుట్‌ కాని పృథ్వి కామెడీ
– రెండు మనసులు కలిసేందుకు ప్రథమార్థం వాడుకున్న దర్శకుడు.. ఆ తరవాత ఆ బంధం బలపడే సన్నివేశాలు లేకపోవడం..
– హీరోయిన్‌ కుటుంబంతో కలిసిపోయే బలమైన నేపథ్యం కల్పించకపోవడం
ఫలితం..
పవన్‌ నుంచి ఎటువంటి సినిమా వచ్చిన భారీ ఓపినింగ్స్‌ అనేది సహజం.. ఇక అభిమానుల విషయం చెప్పాల్సిన పనేలేదు.. ఇప్పుడు ఈ చిత్రంతో మాస్‌ ఎలిమెంట్స్‌ ఉండటంతోపాటు చక్కటి లవ్‌ట్రాక్‌ ఉండటంతో ఇటు ఫ్యామిలీ ఆడియన్స్‌తోపాటు, యూత్‌కి దగ్గరవుతుంది.. అన్ని వర్గాలకు చేరవలో చిత్రాన్ని తెరకెక్కించడంలో డాలీ విజయం సాధించాడు కాబట్టి.. బాక్సాఫీస్‌ రికార్డ్స్‌ గురించే ఆలోచించుకోవాల్సి ఉంటుంది..
‘ప్రేమ’ రాయుడు

శ్రీ

Did you find apk for android? You can find new Free Android Games and apps.1 Comment

Leave a Reply

Your email address will not be published.


*