ఏపీ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఎవ‌రు గెలిచిన‌ట్లు!Want create site? Find Free WordPress Themes and plugins.

ఏపీలోని మూడు జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో తెలుగుదేశం అభ్య‌ర్థులు సాధించిన గెలుపు ఎవ‌రి ఖాతాలో ప‌డాల‌న్న‌దే చ‌ర్చ‌. ఎలా గెలిచామ‌నేది కాదు. గెలిచామా! లేదా అన్న‌దే పాయింట్ అనేది దేశం వాద‌న‌. నైతికంగా వైసీపీయే గెలిచింద‌నేది ఫ్యాన్ ఫాలోయర్స్ అభిప్రాయం. అధికార పార్టీ మూడు సీట్ల‌కు 300 కోట్లు రూపాయ‌లు ఖ‌ర్చుపెట్టింద‌ని.. ప్ర‌తిప‌క్షం విమ‌ర్శిస్తోంది. 2014లో సార్వ‌త్రిక ఎన్నిక‌ల అనంత‌రం సీమ జిల్లాల్లో స్థానిక సంస్థ‌ల్లో పోటీప‌డిన తెలుగుదేశం ఆశించిన స్థాయిలో మెజార్టీ సాధించ‌లేక‌పోయింది. ఎంపీటీసీలు, జ‌డ్పీటీసీలు, స‌ర్పంచ్‌లు చాలా వ‌ర‌కూ వైసీపీ ఖాతాలోనే ప‌డ్డాయి. ఈ స్థానాల నుంచి ఎన్నిక‌య్యే ఎమ్మెల్సీ అభ్య‌ర్థులు.. వైసీపీకే ప‌ట్టం క‌ట్టాలి. మ‌రి మ‌ధ్య‌లో వ‌చ్చిన టీడీపీకు ఓటేయటం వెనుక ఆంత‌ర్యం ఏమిటీ. ఒక‌వేళ వారంతా టీడీపీను ఇష్ట‌ప‌డేవారైతే.. అప్ప‌ట్లోనే సైకిల్ ఎక్కేవారు. ఈ లెక్క‌న ప్ర‌తిప‌క్ష వైసీపీ చేస్తున్న విమ‌ర్శ‌ల‌నే ప్ర‌జ‌లు ప‌రిగ‌ణ‌లోకి తీసుకునే ప్ర‌మాదం ఉంద‌నేది తెలుగుదేశం గుర్తించాల్సిన అంశం. సాధ‌ర‌ణంగానే కేంద్రం, రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకున్న పార్టీల వైపే ప్ర‌జ‌లు మొగ్గుచూపుతారు. ప్ర‌తిప‌క్ష పార్టీలంటే అభిమానం ఉన్నా ఆ పార్టీ గెల‌వ‌టం వ‌ల్ల  నిధులు రావ‌ని, ప్ర‌భుత్వ ప‌థ‌కాలు అమ‌లుకావ‌నేది ప్ర‌జ‌ల‌కూ తెలిసిన అంశం. అందుకే.. అధికార పార్టీ అభ్య‌ర్థులే లోక‌ల్ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధిస్తుంటారు. ఇదంతా అధికార పార్టీ గొప్ప‌త‌నం భావించి అతివిశ్వాసం ప్ర‌ద‌ర్శిస్తే దెబ్బ‌తినే ప్ర‌మాదం ఉంద‌నేది గ‌త ప్ర‌భుత్వాల‌ను చూస్తే అర్ధ‌మ‌వుతోంది. ఎన్నిక‌ల బ‌రిలో విజ‌యం సాధించిన పార్టీకు ప్ర‌జ‌ల ఆధ‌రణ ఉండ‌టం వెనుక మ‌రో ఆంత‌ర్యంను గుర్తించాల్సి ఉంటుంది. అదే ప్ర‌త్య‌ర్థి పార్టీల బ‌ల‌హీన‌త‌. 2004 ఎన్నిక‌ల నాటికి ప‌దేళ్ల ప‌రిపాల‌న పూర్తిచేసిన టీడీపీ ఉంది. అలిపిరి వ‌ద్ద న‌క్సల్స్ జ‌రిపిన బాంబుదాడి నేప‌థ్యంలో ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు టీడీపీ వ్యూహ‌ర‌చ‌న చేసింది. చంద్ర‌బాబునాయుడు ప‌ట్ల ప్ర‌జ‌ల్లో స‌ద‌భిప్రాయం వున్నా.. ప్ర‌భుత్వం ప‌ట్ల వ్య‌తిరేక‌త మొద‌లైంద‌నేది టీడీపీ గుర్తించ‌లేక‌పోయింది. ఈ బ‌ల‌హీన‌తే.. కాంగ్రెస్‌కు బ‌లంగా మారింది. వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి పాద‌యాత్ర‌తో కాంగ్రెస్ పార్టీ త‌న‌కు అనుకూలంగా మార్చుకుంది. 2014లో టీడీపీ బ‌లంక‌న్నా.. వైసీపీ బ‌ల‌హీన‌త‌, విభ‌జ‌న పాపం మూట‌గ‌ట్టుకున్న కాంగ్రెస్ రెండు పార్టీలనూ ప్ర‌జ‌లు దూరంగా ఉంచారు. ఆ బ‌ల‌హీన‌త టీడీపీకు బ‌లంగా మారింది. ప్ర‌స్తుతం టీడీపీపై ఏపీ ప్ర‌జ‌ల్లో సానుకూల ప్ర‌భావం వున్న మాట నిజ‌మే. అంత‌మాత్రాన‌.. 2019లోనూ ఇదే విధంగా ఉంటుంద‌నేందుకు అవ‌కాశం లేదు. ఏడాదిలో మూడు కాలాలు మారుతున్న‌ప్పుడు. ప్ర‌జ‌ల్లో ఐదేళ్ల‌కోసారి మూడ్ మార‌ద‌నుకోవ‌టం రాజ‌కీయ పార్టీల గ్ర‌హ‌పాటు. సో.. అధికారం ద‌క్కించుకున్న పార్టీ విజ‌యంలో స్వ‌పక్ష బ‌లం ఎంత వుంటుందో.. ప్ర‌తిప‌క్షం బ‌ల‌హీన‌త అంతే ఉంటుంద‌నేది.. రాజ‌కీయ మేధావుల విశ్లేష‌ణ‌.

Did you find apk for android? You can find new Free Android Games and apps.Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*