కాపు కార్పోరేష‌న్‌తో  బాబు భేటీ



Want create site? Find Free WordPress Themes and plugins.
కాపు కార్పోరేషన్ కు రూ.1000 కోట్లు బడ్జెట్ కేటాయించినందుకు కాపు కార్పోరేషన్ ఛైర్మన్ ఆధ్వర్యంలో ధన్యవాదాలు తెలిపి ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో సీఎం చంద్రబాబు నాయుడును కలిసిన 13 జిల్లాల కాపు కార్పోరేషన్ ప్రతినిధులు. నిధులు ఎలా ఉప‌యోగించాలి అనే అంశం పై ప్రతినిధుల‌తో సీఎం చ‌ర్చించారు. అనంత‌రం కాపు కార్సోరేషన్ ఛైర్మన్ చలమలశెట్టి రామానుజయ మాట్లాడుతూ ఏప్రిల్ 2 నుండి జిల్లా స్థాయిల్లో కాపు కార్పోరేషన్ లబ్ధిదారుల ద్వారా అవగాహన సదస్సులు నిర్వహిస్తాం. ప్రభుత్వం కాపుల అభ్యున్నతికి కట్టుబడి చేస్తుందని, హామీని నిలబెట్టుకుని అన్నివిధాలా కాపు సామాజిక వర్గానికి అండగా నిలుస్తున్నారన్నారు. ఈ విషయంలో మాటకు నిలబడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదర్శ నాయకుడిగా కాపుల మదిలో చిరస్థాయిగా నిలుస్తారన్నారు. కాపు కార్పోరేషన్ ద్వారా లబ్ధిపొందిన యువత ద్వారా ఏప్రిల్ 2వ తేదీ నుండి 13 జిల్లాల స్థాయిల్లో  కాపు కార్పోరేషన్ లబ్ధిదారుల అవగాహన సదస్సులను పెద్దగా నిర్వహిస్తున్నామని ఛైర్మన్ చలమల వెల్లడించారు. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేసిన వారిలో అఖిల భారత కాపు సమాఖ్య అధ్యక్షుడు నరహరిశెట్టి శ్రీహరి, ఉపాధ్యక్షుడు కె.లక్ష్మయ్య, ఘంటా గౌతమ్, అనంతపురం నుండి పవన్ కుమార్, పశ్చిమగోదావరి నుండి పద్మారావు, కృష్ణాకు చెందిన అడపా మాళవిక, గుంటూరుకు చెందిన భారతి, తూర్పుగోదావరికి చెందిన అప్పారావు, కార్పొరేషన్ సంచాలకులు వడ్డెర సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*