జగన్‌ విచిత్ర ధోరణి



Want create site? Find Free WordPress Themes and plugins.

పిడుగుకీ, బియ్యానికీ ఒకటే మంత్రం అన్నట్టుగా ఉంది వైసీపీ అధినేత వై.ఎస్‌. జగన్మోహన్‌ రెడ్ధి ధోరణి. ఆయన ధోరణిని నిశితంగా గమనించినవారికి తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డికీ, ఆయనకూ హస్తిమశకాంతరం తేడా ఉన్నట్టనిపిస్తుంది. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎటువంటి బడ్జెట్‌ను సమర్పించినా సమర్థించాలని, ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వం ఎటువంటి బడ్జెట్ సమర్పించినా తీవ్రంగా విమర్శలు గుప్పించాలని ఆయన తమ పార్టీ శాసనసభ్యులకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది. తెలంగాణలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతో నర్మగర్భంగా స్నేహసంబంధాలు నెరపుతున్న జగన్‌ ఏపీలో మాత్రం చంద్రబాబు ప్రభుత్వంపై అయిన దానికీ కాని దానికీ కారాలు మిరియాలు నూరుతుండడం తెలిసిన విషయమే.
ఇదే నేపథ్యంలో ఆయన నిన్న తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ సమర్పించిన బడ్జెట్‌పై సానుకూల వ్యాఖ్యలు చేశారు. పెద్దగా విమర్శించే పని పెట్టుకోలేదు. అయితే, రేపు ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వం సమర్పించబోయే బడ్జెట్‌ను మాత్రం ఈకకు ఈక పీకకు పీక పీకేయాలని ఆయన తమ శాసనసభ్యులకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారని తెలిసింది. తాను ఏంచేసినా తెలంగాణలో పాగా వేయడం కష్టమని, అందువల్ల తెలంగాణ ప్రభుత్వంతో స్నేహ సంబంధాలు నెరపడమే ఉత్తమమని ఆయన భావిస్తున్నారు. అదే విధంగా ఏపీలో తను మున్ముందు అధికారంలోకి వచ్చే అవకాశం ఉందనే ఆలోచనతో ఆయన చంద్రబాబు ప్రభుత్వంపై అవసరమున్నా లేకపోయినా విమర్శనాస్ర్తాలు సంధిస్తున్నారు.

Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*