బ‌డ్జెట్ స‌మావేశాల్లో వైసీపీ దూకుడు…



Want create site? Find Free WordPress Themes and plugins.
ఆంధ్రప్రధేశ్ రాజధాని అమరావతి లో తొలి సరిగా బడ్జెట్ సమావేశాలకు వైసీపీ సిద్ధమవుతోంది… ఇందుకోసం రేపు విజయవాడలో పార్టీ ఎమ్మెల్లేలా సమావేశం జరగనుంది. సభలో పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు ఏం చేయాలో వైఎస్ ఆర్ సిపి  సమావేశంలో నిర్ణయించనున్నారు.. ఈసారి సభలో దూకుడు ప్రదర్శించాలని జగన్ వ్యూహంగా తెలుస్తుంది.. ఏపీలో యూత్ ఓటు బ్యాంకును ఆకర్షించాలంటే దూకుడుగా వెళ్లాలని ఎమ్మెల్యేలతో జగన్ చెప్పినట్లు సమాచారం. సభలో అవసరమైతే ఎంతవరకు అయినా వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యేల‌కు జ‌గ‌న్‌ చెప్పినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకోసం ఒక బృందాన్ని సిద్ధం చేసినట్లు సమాచారం. ఏపీకి ప్రత్యేక హోదా, వైజాగ్ లో క్యాండిల్ ర్యాలీ సందర్భంగా జరిగిన పరిణామాలు, విజయవాడ బస్సు ప్రమాదంలో ప్రభుత్వ తీరు, ధరలు, రైతు ఆత్మహత్యలు, వంటి సమస్యలను ప్రధాన అస్రాలుగా జగన్ ఎంచుకున్నట్లు తెలుస్తుంది. పార్టీలో సీనియర్లయిన బొత్స, ఉమారెడ్డి, విజయ సాయి రెడ్డిలు కూడా సమావేశాలు జరుగునప్పుడు అందుబాటులో ఉండాలని జగన్ చెప్పినట్లు తెలిసింది. రోజా వ్యవహారశైలి పై కొందరు ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.  సభలో ఆమె రన్నింగ్ కామెంట్రీ వల్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని జగన్ దృష్టికి కొందరు ఎమ్మెల్యే లు తీసుకువెళ్లార‌ట‌. ఆమె ఏడాది సస్పెన్షన్ పూర్తీ కాగా సభలో ఆమెపై స్పీకర్ నిర్ణయం ఎలా ఉంటుందో చూసి తరువాత ఆలోచిస్తామని జగన్  స‌మాధానం ఇచ్చార‌ట‌. మొత్తానికి వైసీపీ రాజధాని అమరావతిలో తొలిసారి జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రజలకు ఎంతమాత్రం ఉపయోగపడేలా జరుగుతాయో వేచి చూడాలి…
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*