బాబు ‘క‌మ్మ‌’ల‌ను విస్మ‌రిస్తున్నారు: రాయపాటి



Want create site? Find Free WordPress Themes and plugins.
బాబు ‘క‌మ్మ‌’ల‌ను విస్మ‌రిస్తున్నార‌ని ఎంపి రాయ‌పాటి సాంబ‌శివ‌రావు ఆరోపించారు. కమ్మజన  సేవా సమితి లో కాకతీయ కన్వెన్షన్ కమిటి కార్యవర్గ సమావేశంకు హాజరైన ఎంపీ రాయపాటి, పలువురు ప్రముఖులు. సీఎం చంద్రబాబు తీరు పై ఎంపీ రాయపాటి ఫైర్ అయ్యారు..చంద్రబాబు కమ్మ కులాన్ని పట్టించుకోవడం లేదు. పార్టీ కోసం పనిచేసే వారిని, పార్టీ ని నిలబెట్టేవారిని నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఓట్లు కోసం …తన పదవి కోసం బాబు ఓ కులానికి కొమ్ము కాస్తున్నాడు. నేను టీడీపీ లో చాలా జూనియర్ ని..అందుకే బాబు ను గట్టిగా ప్రశ్నంచలేకపోతున్నా.పార్టీ లోని కమ్మ నేతలు సీఎంను  ప్రశ్నించే  స్థితిలో లేరు. గ్రామ స్థాయిలో పార్టీ కోసం పని చేసిన క్యాడర్ చాలా నిరుత్సాహంగా  ఉన్నారు. ఇది పార్టీ మనుగడకు మంచిది కాదు. జగన్ అధికారం లోకి రాడని  జేసి ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళే బహిరంగంగా తిడుతున్నారు. బాబు గాని, లోకేష్ గాని మరో 15 నుంచి 20 సంవత్సరాలు అధికారంలో ఉంటారు. నేను ఇక ప్రత్యక్ష ఎన్నికలలో పోటీచేయను. నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం లో రిటైర్డ్ ఐఏఎస్ లకు అధిక ప్రాధాన్యం  ఇస్తున్నారు. వారిని నెత్తిన ఎక్కించుకోవడం మంచిది కాద‌ని రాయ‌పాటి అన్నారు. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*