తెలంగాణ పరిణామలపై ఏ పీ దృష్టి



Want create site? Find Free WordPress Themes and plugins.
2014 అసెంబ్లీ ఎన్నికలు పూర్తి అయిన తరువాత ఏపీ లో చంద్రబాబునాయుడు, తెలంగాణ లో కే సీ ఆర్ ప్రభుత్వం ఏర్పాటు చెసిన విషయం తెలిసిందే. కాని ఏపీ లో మాత్రం ప్రతిపక్ష పార్టీ దూకుడుగ వ్యవహరిస్తూ టీడీపీ ని ఇబ్బంది పెడుతున్న విషయం తెలిసిందే. వై సీ పీ ని కట్టడి చేసేందుకు ప‌చ్చ చొక్కా పార్టీ నాయ‌కులు ఆక‌ర్ష్ ప‌థ‌కంలో ఎమ్మేల్యేల‌ను త‌మ గూటికి రప్పించుకున‌ప్ప‌టికి ప‌రిస్థితిలో మార్పు రాలేదు. మ‌రో వైపు టీఆర్ ఎస్ ప్ర‌భుత్వం కు తెలంగాణ‌లో ఎదురు లేకుండా పోయింది. ప్ర‌తిప‌క్షాలు ఉన్నా దూకుడుగా వ్య‌వ‌హ‌రించిన సంద‌ర్భాలు లేవు. ప్ర‌తిప‌క్షాల‌ను క‌ట్ట‌డి చేయ‌డంలో కేసీఆర్ స‌ఫ‌లీకృతుల‌య్యార‌ని ఏపీ నాయ‌కులు అన్నారు. ఇన్నాళ్లు టీఆర్ ఎస్ రాజ‌కీయాల‌పై వారు దృష్టి కూడా పెట్ట‌లేదు. కాని  ఇప్పుడు తెలంగాణ‌లో నిరుద్యోగుల ర్యాలీ పేరిట ప్రొఫెస‌ర్ కోదండ‌రాం బ‌య‌ట‌కు వ‌చ్చారు. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా జెండా ఎగుర‌వేశారు. ఈ ప‌రిణామాలు ఆస‌క్తిక‌రంగా మారాయి. తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క భూమిక పోషించిన విద్యార్ధులు కూడా కోదండ‌రాం వైపే నిల‌బడ్డారు. దీంతో ఇక్క‌డ జ‌రుగుతున్న వ్య‌వ‌హారంపై ఏపీ నాయ‌కులు దృష్టి సారించాయ‌ట‌. హై కోర్టు ర్యాలీకి అనుమ‌తిచ్చిన నేప‌థ్యంలో కేసీఆర్ ప్ర‌భుత్వం అడ్డుకుంటుందా లేక ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటుంది అన్న అంశాలు ఆస‌క్తి క‌రంగా గ‌మ‌నిస్తున్నారు. కోదండ‌రాం స‌క్సెస్ అవుతే ప‌రిణామాలు ఎలా ఉంటాయి అని చ‌ర్చించుకుంటున్నారు. అయితే ఏపీ నాయ‌కులు ఇక్క‌డ టీఆర్ ఎస్ విష‌యాల్లో ఎందుకు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు అనుకుంటున్నారంటే……టీడీపీ, వైసీపీలకు తెలంగాణ‌లో ఇప్ప‌టికే త‌మ కార్య‌కాలాపాలు సాగిస్తున్నాయి. ఆశించినంత ఫ‌లితాలు లేక‌పోవ‌డంతో కోదండ‌రాం ఉద్య‌మం త‌మ‌కు ఎంత వ‌ర‌కు ఉప‌యోగ‌ప‌డుతుందో అన అంచ‌నాలు వేస్తున్నారు. సీఎం కేసీఆర్ ఒంటెత్తు పోక‌డ‌ల‌తో ప్ర‌జ‌ల్లో పెరుగుతున్న వ్య‌తిరేక‌త‌ను త‌మ‌కు అనూకూలంగా మార్చుకునేందుకు కార్యాచ‌ర‌ణ రూపొందించుకుంటున్నార‌ట‌. రాజ‌కీయాల్లో చిన్న అవ‌కాశాన్ని కూడా స‌ద్వినియోగ‌ప‌ర్చుకోవాల‌ని పార్టీలు ఎత్త‌ులు వేస్తాయన‌డానికి ఇదే నిద‌ర్శ‌నం.
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*