ఆప్ తో జత కడుతున్నాడా పవన్….



Want create site? Find Free WordPress Themes and plugins.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతి కదలిక ఏపీ రాజకీయాల్లో ఆసక్తిని రేపుతోంది. వరుస సభలతో ఇప్పటికే హోరెత్తిస్తున్న జనసేనాని దానిని ఇకముందునూ  కొనసాగించనున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీ లో  సమావేశం కోసం అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే.ఇప్పటికే పవన్ ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హోదా, ఉద్దానం కిడ్ని సమస్య, అమరావతి మరియు పోలవరం భూసేకరణ వంటి అంశాలపై ప్రజల్లోకి వెళ్లారు. 2019 ఎన్నికలకు సిద్ధం కావాలంటే విస్తృతంగా పవన్ ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్న విషయం తెలిసిందే. అమెరికా పర్యటన లోను పవన్ జనసేన పార్టీ అంశాన్ని ఎన్నారైల ముందు ప్రస్తావించారు. వచ్చే ఎన్నికల్లో ఓ మంచి ఆలోచనతో, సామాజిక స్పృహతో ముందుకు వెళ్లే వారితో పొత్తు పెట్టుకునేందుకు సముఖంగా ఉన్నట్లు తెలిపారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అమ్ ఆధ్మి నేత అరవింద్ కేజ్రీర్వాల్ తో పొత్తు ఉంటుందని చెప్పనే చెప్పారు.  వాస్తవానికి  కాపుల అండ పవన్ కు ఇంతో అంతో వుంది, అభిమాన యువత బలం వుంది. అందువల్ల పవన్ కళ్యాణ్ అవసరం 2014 ఎన్నికల్లో ఎంత వుందో, 2019 ఎన్నికల్లో అంతకు అంత వుంది. ఎలా అయినా పవన్ ను తన పక్కనుంచి తప్పిపోకుండా చూసుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. అది క్లియర్ గా కనిపిస్తోంది. పవన్ తన స్టయిల్ లో తాను ఎంత రెచ్చిపోతున్నా, తెలుగుదేశం జనాలు పల్లెత్తు మాట మాట్లాడడం లేదు అంటే దానికి కారణం ఇదే తప్ప వేరు కాదు. విశాఖ హడావుడికి మూలం పవన్ అయితే, జగన్ ను టార్గెట్ చేయడమంటే పవన్ కు బాబు అండ్ కో ఎంత భయపడుతున్నారో? పవన్ పట్ల ఎంత ఒదిగి వుంటున్నారో ఇట్టే అర్థం అవుతుంది. పవన్ అసలు టార్గెట్ ఏమిటి? కేవలం ప్రజా సమస్యలపై స్పందిస్తూ వుండడమేనా? లేక ఎన్నికల్లో పోటీ చేస్తారా? ఎన్నికల్లో పోటీ చేయని దానికి అయితే ఇంత హంగామా అక్కరలేదు. అమెరికా వెళ్లి మరీ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ లను కలవాల్సిన పని లేదు. మళ్లీ ఎన్నికల ముందు కలుద్దాం అని ఓ మాట చెప్పి రానక్కరలేదు. మరి ఎన్నికల్లో పోటీకి దిగితే ఆంధ్రకు ప్రత్యేక హోదా సాధించలేకపోయారని చంద్రబాబుకు దూరం జరుగు తారా? లేక లోపాయికారీ ఒప్పందం ఏదైనా కుదర్చుకుని,ఏదో సాకు చూపించి, జనాలు బుర్రగోక్కునే విధంగా ఏవో నాలుగు మాటలు చెప్పి,చంద్రబాబుతో కలిసే ప్రయాణిస్తారా? అలా అయితే కింగ్ మేకర్ గా వుండడం మినహా పవన్ కు ఒదిగేది లేదు. ఇప్పటి వరకు పవన్ ఒప్పుకున్న సినిమాలు 2019 నాటికి పూర్తయిపోతాయి. మరి అప్పుడైనా ఫుల్ టైమ్ రాజకీయ వేత్తగా మారతారా? అన్న సందేహం మరోసారి నెలకొంది. అయితే ఇటీవల హార్వర్డ్ యూనివర్సిటీ లో జరిగిన ఇంటర్వ్యూ లో ఆయన జనసేన పార్టీకి సంబందించిన కీలక అంశాన్ని తెలిపారు.2019 ఎన్నికల్లో ఆప్ (ఆమ్ ఆద్మీ పార్టీ ) పొత్తు పెట్టుకునే అవకాశం ఉందా అని ప్రశ్నించగా.. ”దానిగురించి నేను ప్రస్తుతం ఆలోచించడం లేదు. కానీ నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం ఒకే ఆలోచనలు కలిగిన వారు కలసి పని చేయాలి” అని పవన్ తెలపడం విశేషం.పవన్ ఒక్కమాట తోఅనేక సందేహాలు రేపారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బిజెపితో తెగదెంపులు చేసుకోవడానికి పవన్ దాదాపుగా సిద్ధం అయినట్లు అనిపిస్తోందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఆప్ అధినేత కేజ్రీవాల్ కు బిజెపిని తీవ్రంగా దుయ్యబడుతున్న విషయం తెలిసిందే.కానీ చంద్రబాబు విషయం లో పవన్ వైఖరి ఏంటనేది అర్థం కానీ స్ట్రాటజీ అని అంటున్నారు. బాబు తో విడి పోయేంతగా పవన్ టిడిపిని విమర్శించలేదు. మరోవైపు టిడిపి కూడా పవన్ ఇప్పటికి తమ మిత్రుడే అని సమర్ధించుకుంటోంది. కానీ ఆప్ తో పొత్తు విషయం పవన్ మనసు లో ఉన్నట్లు అతని వ్యాఖ్యల బట్టి తెలుస్తోంది. పవన్ తో స్నేహం కోసం కేజ్రీవాల్ ప్రయత్నిస్తారో లేదో చూడాలి.

Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*