చికాగోలో తెలుగు సంబ‌రాలుWant create site? Find Free WordPress Themes and plugins.
ఉత్త‌ర అమెరికా తెలుగు సంగం (నాట్స్) ఆధ్వర్యంలో అమెరికాలోని చికాగో వేదిక‌గా జ‌రుగ‌నున్న 5 వ  తెలుగు సంబరాలకు సన్నాహాలు మొద‌ల‌య్యాయి. జూన్ 30, జూలై 1,2 వ తేదీ నుంచి ప్రారంభ‌మయ్యే వేడుక‌ల కోసం నాట్స్ మొద‌లు పెట్టిన ఫండ్ రైజింగ్‌కు అనూహ్య స్పంద‌న ల‌భించింది.  చికాగోలోని రమడ  ఇన్ బాంక్వెట్స్ లో జరిగిన ఈ ఫండ్ రైజింగ్ కార్యక్రమానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ జాతీయ కమిటీతో పాటు పలు నగరాల 400 మంది  నాట్స్ చాప్టర్ సభ్యులు హాజ‌ర‌య్యారు. వేడ‌ుక‌ల‌కు త‌మ వంతు స‌హాయం అందిస్తామ‌ని ప్ర‌క‌టించారు.  దాదాపు 8 ల‌క్ష‌ల డాలర్లు విరాళంగా సేక‌రించి వేడుక‌ల అనంత‌రం మిగిలిన డ‌బ్బును సేవా కార్య‌క్ర‌మాలకు ఉప‌యోగించ‌నుంది.   నాట్స్ చేప‌డుతున్న సేవా కార్య‌క్ర‌మాల గురించి డైరెక్టర్ ప్రవీణ్ మోటూరు  వివరించారు.  తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంత రైతుల పిల్లలకు విద్యనందించ‌నున్న‌ట్టు వెల్ల‌డించారు. సంబ‌రాల చైర్మ‌న్‌ ర‌వి ఆచంట, వైస్ చైర్మ‌న్లుగా ప్రవీణ్  మోటూరు, ఫణి రామినేని, కార్య‌ద‌ర్శిగా , మదన్ పాములపాటికి కోశాధికారిగా  శ్రీనివాస్ బొప్పనకు ఎంపిక‌య్యారు.  సీటీఎ ప్రెసిడెంట్  నాగేంద్ర వేగే తో పాటు 18 మంది సంబరాల కమిటీ డైరక్టర్లను చైర్మ‌న్ ర‌వి ఆచంట  పరిచయం చేశారు.ఆర్గనైజింగ్ కమిటీలో భాగంగా.. నేషనల్ టీమ్ ప్రోగ్రామ్స్‌-చౌదరి ఆచంట, నేషనల్ టీమ్ హాస్పిటాలిటీ-అమర్ అన్నె, నేషనల్ టీమ్ ఫండ్ రైజింగ్- గంగాధర్ దేశు, కల్చరల్ అడ్వైజర్-రాజేష్ చిలుకూరి, ఫండ్ రైజింగ్ డైరెక్టర్-మూర్తి కొప్పాక, ప్రోగ్రామ్స్ డైరెక్టర్-సుజనా ఆచంట, బ్యాంకెట్ డైరెక్టర్-రాణి వేగె, రెవెన్యూ జనరేషన్ డైరెక్టర్-శ్రీధర్ ముంగండి, సీఎంఈ డైరెక్టర్-పాల్ దేవరపల్లి ఎండీ, యూత్ ప్రోగ్రామ్స్ డైరెక్టర్-డా.సుధా యలమంచలి, డైరెక్టర్ ఆఫ్ ఫుడ్- ప్రసాద్ తాళ్లూరు, డైరెక్టర్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్-అశోక్ పగడాల, నాలెడ్జ్ అండ్ ఇన్నోవేషన్ డైరెక్టర్-ప్రవీణ్ భూమన, డైరెక్టర్ ఆఫ్ ఆడియో విజువల్/ఐటీ-శ్రీనివాస్ చందు, డైరెక్టర్ మార్కెటింగ్-అరవింద్ కోగంటి, డైరెక్టర్ మీడియా రిలేషన్స్-కాకర్ల మహేష్, డైరెక్టర్ డోనర్స్ హాస్పిటాలిటీ-శ్రీనివాస్ పిడికిటి, డైరెక్టర్ హాస్పిటాలిటీ-శ్రీనివాస్ ఆచంట, డైరెక్టర్ ఫైనాన్స్-నవీన్ అడుసుమిల్లి, కోడైరెక్టర్ పబ్లిసిటీ-వాసుబాబు అడ్డగడ, కోడైరెక్టర్ నాలెడ్జ్ అండ్ ఇన్నోవేషన్-రమేష్ తూము, కోడైరెక్టర్ ఆపరేషన్స్-కృష్ణ నున్న, కోడైరెక్టర్ ఫండ్ రైజింగ్-రాజా చెన్నుపాటి, కోడైరెక్టర్ ప్రోగ్రామ్స్-సుబ్బారావు పుట్రేవు, కోడైరెక్టర్ బ్యాంకెట్-వెంకట్ యలమంచిలి, కోడైరెక్టర్ యూత్ యాక్టివిటీస్-కృష్ణద్రుల, చైర్ బిజినెస్ సెమినార్-లోకేష్ కొసరాజు, చైర్ మాట్రిమోనియల్ సర్వీసెస్-సుమతి పాములపాటి, చైర్ విమెన్స్ ఫోరమ్-శైలజ ముంగడి తమ బాధ్యతలు నిర్వర్తిస్తారు. మొత్తం 50 టీములను తెలుగువారితో ఏర్పాటుచేయడం జరిగింది.ఫండ్ రైజింగ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజ‌రైన‌ నాట్స్ అధ్యక్షులు మోహన కృష్ణ మన్న మాట్లాడుతూ  అమెరికాలోని తెలుగువారి కోసం, తెలుగు రాష్ట్రాల్లోని వారి కోసం నాట్స్ అనేక  సేవా కార్యక్రమాలను చేప‌డుతుంద‌న్నారు. తెలుగు సంబ‌రాల‌ను ఘ‌నంగా నిర్వ‌హించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్న‌ట్టు చెప్పారు.  నాట్స్ ఛైర్మన్ శ్యామ్ మద్దాళి,  చికాగో తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు నాగేంద్ర వేగె, మాజీ అధ్యక్షులు మూర్తి కొప్పాక, బోర్డ్ సభ్యులు డా.పాల్ దేవరపల్లి, రావు ఆచంట త‌దిత‌రులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*