హైద‌రాబాద్‌లో ప్రియాంక గాంధీ ఆక‌స్మిక ప‌ర్య‌ట‌న‌



Want create site? Find Free WordPress Themes and plugins.
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కుమార్తె ప్రియాంకాగాంధీ హ‌ఠాత్తుగా హైద‌రాబాద్ నగరానికి వచ్చారు. ఈ పర్యటన పూర్తిగా ఆమె వ్యక్తిగతం కావడంతో విషయాన్ని కాంగ్రెస్ వ‌ర్గాలు రహస్యంగా ఉంచాయి. బంజారాహిల్స్‌లోని ఎల్వీప్రసాద్ ఆస్ప‌త్రిలో తన కుమారుడు రేహాన్ కంటి చికిత్స కోసం ఆమె శనివారం ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఆమెతో పాటు భర్త రాబర్ట్ వాద్రా, కూతురు మిరయ, కుమారుడు రేహాన్ వచ్చారు. ఎల్వీ ప్రసాద్ కంటి దవాఖానలో ప్రత్యేక వైద్య బృందంతో గుళ్లపల్లి ప్రతిభారావు బ్లాక్‌లో రేహాన్‌కు కంటిపరీక్షలు చేయించారు. ఆ తర్వాత సాయం త్రం 4.45కు వారు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ప్రియాంకాగాంధీ కుమారుడు రేహాన్ ఇటీవల క్రికెట్ అడుతుండగా కంటికి దెబ్బ తగిలింది. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు నిర్వహించగా, అక్కడి వైద్యుల సూచనపై ప్రియాంక తన కుమారుడు రేహాన్‌ను హైదరాబాద్ ఎల్వీప్రసాద్ కంటి దవాఖానకు తీసుకొచ్చినట్టు తెలిసింది. ఈ విషయంపై మాట్లాడేందుకు ఆసుపత్రి వర్గాలు నిరాకరించాయి. సోనియా కుటుంబానికి సన్నిహితంగా ఉండే రాజ్యసభ సభ్యుడు టీ సుబ్బిరామిరెడ్డి, ఆయన కుమార్తె పింకీరెడ్డి ప్రియాంక వెంట ఉన్నట్టు సమాచారం. దీంతో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఎవరూ ప్రియాంకను కలిసే అవకాశం లేకుండాపోయింది.
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*