ఆటోలో మెగాస్టార్‌



Want create site? Find Free WordPress Themes and plugins.
మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడితో మెగాస్టార్ చిరంజీవి కాస్త బిజీ అయిపోయారు. దీంతోపాటు 151వ సినిమా కోసం క‌థ‌లు వింటున్నారు. తాజాగా చిరు ఆటోలో ప్రయాణం చేస్తూ అంద‌రిని ఆశ్చ‌ర్య ప‌రిచారు. స్టార్ మా లో హోస్ట్‌గా ఉండాల్సిన చిరు బ‌య‌ట ఉండ‌టంం అదీ ఆటోలో ఏంటా అని అంద‌రూ ఆశ్చ‌ర్య‌పడ్డారు. కాని దీనికి ఓ క‌థ ఉంది. అదేంటంటే….గురువారం జరిగిన మీలో ఎవరు కోటీశ్వరుడు ఎపిసోడ్ లో సతీష్ అనే ఒక కంటెస్టంట్ హాట్ సీట్లోకి వచ్చాడు.అత‌ను హైదరాబాద్ మేడ్చల్ కు చెందిన ఒక ఆటో డ్రైవర్. ఈ సంద‌ర్భంగా ఆటోజాని పాత్ర గురించి చిరంజీవి గుర్తు చేసుకున్నారు. ‘సార్ మీరు ఒక్కసారైనా నా ఆటో ఎక్కాలి’ అంటూ స‌తీష్‌ రిక్వెస్ట్ చేశాడు. కోటి రూపాయలు కొట్టినా కొట్టకపోయినా కూడా.. నా ఆటో ఎక్కాల్సిందే అన్నాడు. దానితో ఎన్నో ఏళ్ళ తరువాత నిజంగానే చిరంజీవి ఆటో ఎక్కేశారు.అలా చిరంజీవి అన్నపూర్ణ స్టూడియోస్ లో ఆటోలో విహ‌రించారు. చిరు త‌న ఆటోలో ఎక్క‌డంతో సతీష్ ఆనందం ప‌డ్డాడు. చిరంజీవి త‌న ఆటో ఎక్కినందుకు త‌న‌కు కోటీ రూపాయ‌లు గేమ్‌లోగెలుచుకున్నంత ఆనందంగా ఉంద‌ని స‌తీష్ తెలిపాడు. ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవి హోస్ట్‌గా స్టార్‌-మా టీవీలో `మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు?` టెలీకాస్ట్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్విజ్ కార్య‌క్ర‌మానికి ఓ ఆటోవాలా కూడా సెల‌క్ట‌య్యారు. మెగాస్టార్ ముందు హాట్ సీట్లో కూచున్న త‌ను ఓ కోరిక కోరారు మెగాస్టార్‌ని. 25ఏళ్ల ఆటోవాలా కోరిక చాలా స‌ర్‌ప్రైజింగ్‌. తాను ఆటో తోలి ఎంతో శ్ర‌మించి చెల్లి పెళ్లి చేశాడు. అలాంటి ఆటోలో మెగాస్టార్‌ని ఓసారి అలా న‌గ‌రంలో తిప్పాల‌న్న‌ది త‌న కోరిక‌. ఆ కోరిక కోర‌గానే మెగాస్టార్ వెంట‌నే ఓకే చెప్పేశారు. ఆటో ఎక్కి చాలాకాల‌మే అయ్యింది. నాక్కూడా ఆటోలో తిర‌గాల‌ని ఉంది అంటూ చిరు ఆటో ఎక్కారు. షో అనంత‌రం ఆటో ఎక్కి మెగాస్టార్‌ న‌గ‌రంలో శికార్లు వేసి తిరిగి వ‌చ్చారన్న‌మాట‌! అంత పెద్ద స్టార్ అభిమాని కోరిక‌ను మ‌న్నించి ఆటో ఎక్క‌డం నిజంగానే స‌ర్‌ప్రైజింగ్ క‌దూ?
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*