శశికళకు ముందే తెలుసా?



Want create site? Find Free WordPress Themes and plugins.

సుప్రీం కోర్టు తీర్పు తనకు ప్రతికూలంగా ఉండబోతోందన్న విషయం శశికళకు ముందే తెలుసా? తెలుసంటున్నారు ఆమె బంధువులు కొందరు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీం కోర్టు కఠినంగా వ్యవహరించబోతోందని, తీర్పు తనకు ప్రతికూలంగా రావడం ఖాయమని ఆమెకు ముందే సమాచారం అందినట్టు సన్నిహితుల బంధువుల సమాచారం. ఆమె మొదటిసారిగా గవర్నర్‌ విద్యాసాగర్‌ రావును కలుసుకోవడానికి వెళ్లినప్పుడే ఈ మేరకు సూచన ప్రాయంగా సమాచారం అందిందని, దాంతో ఆమె ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు నడుం బిగించారని తెలిసింది. తీర్పు ప్రతికూలంగా వెలువడబోతోందని, మరణించిన జయలలిత విషయంలోనూ సుప్రీం కోర్టు కఠినంగానే వ్యవహరించబోతోందని ఆమెకు గవర్నర్‌ కార్యాలయంలోనే తెలిసినట్టు సమాచారం. ఆమె చెప్పినవన్నీ విన్న తరువాత గవర్నర్‌ ఆమెను విశ్వాసంలోకి తీసుకుని, తీర్పు ఆమెకు ప్రతికూలంగా ఉండే అవకాశం ఉందని సూచించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఎంతో హుషారుగా గవర్నర్‌ను కలుసుకోవడానికి వెళ్లిన శశికళ ఆ సూచనతో ముఖం వేళ్లాడేసుకుని, విచారంతో తిరిగి వచ్చినట్టు బంధువులు చెబుతున్నారు. శశికళకు చేదు కబురేదో అందిందని, అందుకే ఆమె విచారంలో మునిగిపోయారని ఆ తరువాత గవర్నర్‌ను కలుసుకోవడానికి వచ్చిన పన్నీరు సెల్వంకు తెలిసిపోయింది. గవర్నర్‌ను కలుసుకోబోయేముందు విచారంగా ముఖం వేళ్లాడేసుకుని ఉన్న పన్నీరు సెల్వం ఆనందంతో అక్కడి నుంచి తిరిగి వచ్చారని తెలిసింది. పొయెస్‌ గార్డెన్‌ నివాసానికి రాగానే శశికళ భోరుమని ఏడ్చేసినట్టు బంధువుల సమాచారం. ఆ తరువాత ఆ రెండు మూడు రోజుల వ్యవధిని సద్వినియోగం చేసుకోవడానికి శశికళ సమాయత్తమయ్యారు. తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పళనిస్వామిని ఎంపిక చేసుకోవడానికి, ఎమ్మెల్యేలు తమకు కట్టుబడి ఉండేలా చేసుకోవడానికి శశికళ ఈ రెండు మూడు రోజుల వ్యవ ధిని ఉపయోగించుకున్నారు.

Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*