ఓం నమో వేంకటేశాయ : సమీక్షWant create site? Find Free WordPress Themes and plugins.

om namo venkateshaya movieచిత్రం : ఓం నమో వేంకటేశాయ
రేటింగ్‌ :3.25/5
తారాగణం : నాగార్జున, సౌరభ్‌జైన్‌, అనుష్క, ప్రగ్యాజైస్వాల్‌, జగపతిబాబు, రావు రమేష్‌, వెన్నెల కిషోర్‌ తదితరులు
ఛాయా గ్రహణం : ఎస్‌. గోపాల్‌ రెడ్డి
కథ, మాటలు : జె.కె. భారవి
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
నిర్మాత : మహేశ్‌రెడ్డి
దర్శకత్వం : రాఘవేంద్రరావు
అన్నమయ్య, రామదాసు, శిరిడిసాయి వంటి భక్తిరస చిత్రాలతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న నాగార్జున, రాఘవేంద్రరావు క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న మరో కావ్యం ‘ఓం నమో వేంకటేశాయ’ అనగానే అంచనాలు తారాస్థాయికి చేరుకుంటాయి.. భక్తుడిగా భావోద్వేగం పండించడంలో తనకి సరిరారు అన్నంత రీతిలో పాత్రలో ఇమిడిపోయే అక్కినేని నాగార్జున, భక్తి ప్రధానమైన చిత్రాలు తీయాలంటే మాతృకలుగా మిగిలిపోయే చిత్రాలకు దర్శకత్వం వహించే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ప్రేక్షకుల మనసు గెలుచుకోవడానికి మరోసారి ఎటువంటి మ్యాజిక్‌ చేశారు.. ఆశించిన స్థాయిలో చిత్రం వచ్చిందా.. గత వైభవానికి ధీటుగా ఈ సినిమా నిలవబోతుందా అనేది పరిశీలిద్దాం..
కథ..
ఉత్తర భారత దేవానికి చెందిన రామ్‌(నాగార్జున) అనే చిన్న కుర్రాడు దేవుడ్ని చూడాలని సంకల్పించి పద్మానందస్వామి(సాయికుమార్‌) ఆశ్రమం చేరతాడు.. గురుతుల్యుడిగా ఆ బాలుడి కోరిక తీరేలా విద్యాబుద్ధులు నేర్పించి మార్గనిర్దేశకత్వం చేస్తాడు… దేవుడు వచ్చిన గుర్తించలేని రామ్‌.. ఆ తరవాత తన మరదలితో పెళ్లి వద్దంటూ తాను బాలజీ సన్నిధికి ఎలా చేరతాడు.. అక్కడ పరమ భక్తురాలు క్రిష్ణమ్మ(అనుష్క)తో కలసి తిరుమలలో ఎటువంటి కార్యక్రమాలు చేపడతారు.. దుష్టుల చెరనుంచి వేంకన్న ఆలయ బాధ్యతలు ఎలా నిర్వహిస్తారు.. సాక్షాత్తు వేంకటేశ్వరుడు కదిలి రామ్‌ని.. హాతీరామ్‌గా ఎలా మారుస్తాడు.. అనేవి తెరపై వీక్షించాల్సిందే మరి..
విశ్లేషణ..
దర్శకేంద్రుడు తన అనుభవాన్ని ఉపయోగించి తీసిన ప్రతి సన్నివేశం వెనుక ఒక పరమార్థం ఉంది అని తెలియజెప్పడం ఆకట్టుకుంటుంది. తరతరాలు భక్తుల నుంచి ఆ దేవదేవుడు ఏం కోరుకుంటాడు అనే పరమార్థంతో తెరకెక్కించిన విధానం ఆసక్తిగా సాగుతుంది. భక్తిరసాన్ని తనదైన శైలిలో పలికించి నాగార్జున నటన చాలా సహజంగా కనిపిస్తుంది. వందల ఏళ్లనాడు శ్రీవారి ఆలయం ఎలా ఉంది అనేది చూపించడంలో అటు ఆర్ట్‌డైరెక్టర్‌ ప్రతిభతోపాటు, కెమెరామెన్‌ పనితనం అద్భుతంగా ఉంటుంది.. చిత్రీకరించిన లొకేషన్లు మనసును పరవశింపచేస్తుంది. నేపథ్య సంగీతం చాలా ఆహ్లాదకరంసాగుతూ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. పాటలు సైతం సందర్భానుసారంగా వస్తూ వినసొంపుగా ఉంటాయి.. అనుష్క ఆహార్యం, హావభావాలు సినిమాకు ఆకర్షణీయంగా నిలుస్తాయి. ముఖ్యంగా వేంకటేశ్వరుడిగా సుమన్‌ వేయలేదు అనే బెంగ లేకుండా సౌరభ్‌జైన్‌ నటన అద్భుతమనే చెప్పాలి.. విష్ణుమూర్తిగా.. బాలాజీగా పాత్రలో ఇమిడిపోయాడు.. మాటలు పదునుగా.. కథనం బిగువుగా సాగుతుంది. ప్రతి ఒక్కరు తమ పాత్రలకు న్యాయం చేసేలా ప్రతిభను చూపారు.
పాజిటివ్‌ పాయింట్స్‌..
+ నాగ్‌, దర్శకేంద్రుడి క్రేజీ కాంబినేషన్‌
+ తిరుమలలో ప్రస్తుతం జరుగుతున్న సేవలు, నిత్య కల్యాణమహోత్సవం ఎందుకు జరుపుతారో నేపథ్యం తెలియ చెప్పడం..
+ తిరుమలకు చేరిన భక్తులు మొదట ఎవరిని దర్శనం చేసుకోవాలని స్థల పురాణం చెబుతుందో తెలియజెప్పడం..
+ వేయి నామాలవాడ, అఖిలాండకోటి బ్రహ్మాండనాయక పాటలు తెరపై బాగా వచ్చాయి
+ వేంకటేశ్వరుడిగా సౌరభ్‌జైన్‌ నటన సినిమాకే హైలెట్‌గా నిలుస్తుంది.. సినిమా నుంచి బయటి వచ్చినా మనసులో రూపం చెరగని విధంగా హావభావాలు ఆకట్టుకుంటాయి..
+ భక్తుడి కోసం భగవంతుడు పడే తపన.. దైవం కన్నా భక్తుడే గొప్ప అనే భావన తీసుకురావడం కథకు బాగా సరిపోవడం
+ ఎక్కడా అనవసర నాటకీయత లేకుండా కథనం సాగడం
+ ప్రథమార్థ ముగింపు సన్నివేశం, పతాక సన్నివేశం
మైనస్‌ పాయింట్లు..
– భక్తిరస చిత్రం చూశాం అనే భావన తీసుకొచ్చినా లోతుగా కథనంలోకి ప్రేక్షకుడిని తీసుకెళ్లలేకపోవడం..
– హాతీరామ్‌ నేపథ్యం ఆశించిన స్థాయిలో వివరించలేకపోవడం..
– అనుష్క భక్తురాలిగా చూపినా తన లైఫ్‌లో జగపతిబాబు ఎలా వచ్చాడు.. వారి మధ్య సన్నివేశాలేవి ఆకట్టుకోకపోవడం
– జబర్దస్త్‌ టీంకు సారధ్యం వహిస్తూ ఉండే బ్రహ్మానందం.. వారి మధ్య జరిగే సన్నివేశాలు తేలిపోవడం
– కథలో కామెడీని జొప్పించాలన్న దృక్పథంతో అనవసర ప్రయోగాలకు పోవడం..
– అన్నమయ్య, రామదాసు తరహాలో గుర్తిండిపోయే సరైన సన్నివేశాలు చిత్రంలో లేకపోవడం..
– సినిమా నుంచి బయటకు వచ్చేటప్పుడే మనతోపాటు మానసికంగా వచ్చే సౌరభ్‌జైన్‌ వంటి లోతైన పాత్రలు లేకపోవడం
ఫలితం..
కుటుంబం మొత్తం కలిసి చూడగలిగే చిత్రం కావడం.. ఆసక్తిని రేకెత్తించే కాంబినేషన్‌ సినిమాకు కలిసొస్తుంది. ఎక్కడా రాజీ లేకుండా చిత్రీకరణ చేపట్టడంతో అన్ని వర్గాలనుంచి పాజిటివ్‌ వేవ్స్‌ వచ్చేలా చేస్తుందనడంలో సందేహం లేదు.. తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్‌సీస్‌ నుంచి మంచి కలెక్షన్లనే సొంతం చేసుకునే స్టామినా ‘ఓంనమో వేంకటేశాయా’కు నిస్సందేహంగా ఉంది..
‘క్రేజీ కాంబినేషన్‌ నుంచి మరో భక్తిరసామృతం’

శ్రీ

Did you find apk for android? You can find new Free Android Games and apps.1 Comment

  1. raghavendra rao anavasaranga brahmanandam, gundu tho cheyinche vekili comedytho annamayya, ramadasu, ippati namo venkatesaya chithralameeda vunna gouravam pothuvuntundi.inthamathram aa peddyanaku yenduku ardham kado theleedu.mari evari balavanthamo ee comedy?

Leave a Reply

Your email address will not be published.


*