ఓం నమో వేంకటేశాయ’ కేరీర్‌లో మైలు రాయిగా నిలుస్తుంది:  నాగార్జున



Want create site? Find Free WordPress Themes and plugins.
om namo venkateshaya movieఅన్న‌మ‌య్య , శ్రీ‌రామ‌దాసు, షిరిడి సాయిబాదా సినిమాల‌తో ఘ‌న విజ‌యాలు అందుకున్న కింగ్  నాగార్జున , దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు త్ర‌యం  తాజాగా  ఓం న‌మో వెంక‌టేశాయ సినిమా రూపొందించారు. ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 10న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ది. కృపా ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై ‘శిరిడిసాయి’ నిర్మాత ఎ. మహేష్‌రెడ్డి నిర్మించిన భక్తిరస కథా చిత్రం ‘ఓం నమో వేంకటేశాయ’. స్వరవాణి కీరవాణి సంగీత దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆడియో సంగీత ప్రియుల‌ను విశేషంగా అల‌రిస్తోంది. కొన్ని వందల‌ సంవత్సరాల క్రితం వేంకటేశ్వర స్వామి, హధీరామ్‌ బాబా మధ్య జరిగిన రియల్‌ ఇన్సిడెంట్స్‌తో ఈ చిత్రం రూపొందింది.  రిలీజ్‌ అవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్‌ ఫిబ్రవరి 8న హైదరాబాద్‌ ప్రసాద్‌ ల్యాబ్‌లో ప్రెస్‌మీట్‌ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అక్కినేని నాగార్జున, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, నిర్మాత ఎ. మహేష్‌రెడ్డి, సౌరభ్‌ జైన్‌, హీరోయిన్స్‌ విమలారామన్‌, అశ్విత, కథా రచయిత జె.కె. భారవి, పాట రచయితలు వేదవ్యాస్‌, అనంత శ్రీరాం, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ కె. విక్రం కుమార్‌, ఎడిటర్‌ గౌతంరాజు, కెమెరామెన్‌ ఎస్‌.గోపాల్‌రెడ్డి, కళా దర్శకుడు కిరణ్‌కుమార్‌ మన్నే పాల్గొన్నారు. అక్కినేని నాగార్జున మాట్లాడుతూ –  ‘మనం’, ‘సోగ్గాడే చిన్నినాయనా’, ‘ఊపిరి’ మూడు సూపర్‌హిట్‌ సినిమాల‌ తర్వాత ఓం న‌మో వెంక‌టేశాయ లాంటి భ‌క్తి ర‌స సినిమా చేయ‌డం ఏంటి అనుకున్నారు. కమర్షియల్‌ సినిమా ఎప్పుడైనా చేయొచ్చు. ఆల్‌రెడీ 95 సినిమాలు చేశాను. ‘ఓం నమో వేంకటేశాయ’ సినిమా చేసే అవకాశం రావడం నా అదృష్టం.om namo venkateshaya movie1 ఈ సినిమా వెరీ స్పిరిచ్యువల్‌, బ్యూటిఫుల్‌ జర్నీ. ఇలాంటి అవకాశం రావడం చాలా చాలా కష్టం. ఈ సినిమా చేసేటప్పుడు ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. ఎంతో డీప్‌కెళ్లి రచయితలు పాటలు రాశారు. తిరుమల‌లో జరిగిన ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. తిరుమల‌కి ఎందుకు వెళ్లాలి, అక్కడ ఏం చేయాలి, అసలు దేవుడు వున్నాడా? లేడా? అనే విషయాలు పక్కనపెడితే దేవుడ్ని పూజించి ఆయనకి చేయాల్సిన పనుల‌న్నీ సక్రమంగా చేస్తే మనలో ఒక ఆత్మ స్థైర్యం వస్తుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ సినిమా చేసేటప్పుడు నాకు తెలియని విషయాలు ఎన్నో తెలుసుకోవడం నా అదృష్టం. ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్‌ అయిందో, ఎప్పుడు ఫినిష్‌ అయిందో కూడా నాకు తెలీదు. ‘అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా..’ పాటతో ఫస్ట్‌ షాట్‌ తీశారు రాఘవేంద్రరావు గారు. దేవుడికి స్వాగతం పలికే సీన్‌ అది. నా కెరీర్‌లో ఈ సినిమా ది బెస్ట్‌ ఫిలిం అని గర్వంగా చెబుతున్నాను. సినిమా చూసే ప్రతి ఒక్కరి హార్ట్‌ని టచ్‌ చేస్తుంది  సినిమా ఎన్ని రోజులు ఆడుతుంది అనే టెన్షన్‌, భయం ఏమీ లేదు నాకు. ఫస్ట్‌ టైం నా లైఫ్‌లో టెన్షన్‌ లేకుండా ఉన్నాను. సినిమా చూశాను. చాలా చాలా హ్యాపీగా ఉన్న‌ట్టు చెప్పారు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ – ‘‘ప్రపంచంలో ఎన్ని పూలు ఉన్నాయో వాటన్నింటి గురించి వేదవ్యాస్‌ చక్కగా పాట రూపంలో రాశారు. ఫిబ్రవరి 10 నుండి ‘ఓం నమో వేంకటేశాయ’ ఆడే థియేటర్లన్నీ తిరుమల దేవాయాలుగా మారిపోతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, వరల్డ్‌వైడ్‌గా థియేటర్లు పుణ్యక్షేత్రాలుగా వెల‌గబోతున్నాయి. అనుష్క కృష్ణమ్మ పాత్రలో ‘వెయ్యి నామాల‌వాడా మూడు నామాల‌వాడా’ అనే పాటతో స్వామిని అనేకరకాలుగా సందర్శిస్తారు. హధీరాం బాబాగా నాగార్జున అద్భుతంగా నటించారు. ‘అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా’ పాటతో దేవుడి తలుపు తెరిచే సన్నివేశంలో నాగార్జున కళ్లలో వున్న పవర్‌ కనిపిస్తుంది. ’’ అన్నారు. naragjuna-anuskhaనిర్మాత ఎ.మహేష్‌రెడ్డి మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాతో నా జన్మ ధన్యం అయింది. ఈ సినిమా తీసే అవకాశం ఇచ్చిన రాఘవేంద్రరావుగారికి, నాగార్జున గారికి థాంక్స్‌. ఒక ఫ్యామిలీలా షూటింగ్‌ చేశాం. ఈ సినిమా స్టార్టింగ్‌ నుండి ఇప్పటి వరకు మొత్తం ఆ గోవిందుడే మమ్మల్ని నడిపించాడు. 500 సంవత్సరాల‌ క్రితం తిరుపతి ఏవిధంగా ఉండేదో భారవిగారు అద్భుతంగా చెప్పారు. గోపాల్‌రెడ్డి, ఆర్ట్‌ డైరెక్టర్‌ కిరణ్‌ మూడు నెల‌లు కష్టపడి లొకేషన్స్‌ని ఫైనల్‌ చేశారు. తమిళనాడు, కర్ణాటక, మాల్దీవులు, మహాబలేశ్వరంలో షూటింగ్‌ చేశాం. రాఘవేంద్రరావుగారు ఈ వయసులో కూడా ఎంతో ఎనర్జీతో పనిచేశారు. ఇదే డేట్‌కి రిలీజ్‌ చేయాల‌ని పూజ రోజే అనుకున్నాం. .  ఈ సినిమాలో హధీరాం బాబా బాలాజీ అని వేంకటేశ్వర స్వామికి పేరుపెట్టారు. ఈ విషయం నాకు ఇంతవరకు తెలియదు. వేంకటేశ్వర స్వామి భ‌క్తులంద‌రికీ ఈ సినిమా తీపిగుర్తుగా మిగిలిపోతుంది. ’’ అన్నారు. నటుడు సౌరభ్‌జైన్‌ మాట్లాడుతూ ` ‘‘ఈ సినిమాలో నటించే అవకాశం రావడం నా అదృష్టం. ఈ అవకాశం ఇచ్చిన రాఘవేంద్రరావు, నాగార్జున, గోపాల్‌రెడ్డి గారికి నా థాంక్స్‌. తెలుగు లాంగ్వేజ్‌ ప్రాబ్లం రాకుండా డైరెక్టర్‌గారు, మా టీమ్‌ అందరూ ఎంతో సపోర్ట్‌ చేశారు. ఒక పిక్నిక్‌లా షూటింగ్‌ జరిగింది. ఈ సినిమా అమేజింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ని ఇచ్చింది’’ అన్నారు. కథా రచయిత జె.కె. భారవి మాట్లాడుతూ ` ‘‘పది సంవత్సరాలుగా ఈ కథపై ఎన్నో రీసెర్చ్‌లు చేశాను. రాఘవేంద్రరావు, నాగార్జున మహేష్‌రెడ్డి గార్లు ఈ కథని ఓకే చేశాక వన్‌ ఇయర్‌పాటు ఒక యజ్ఞంలా భక్తి శ్రద్ధల‌తో ఈ సినిమా షూటింగ్‌ చేశాం. పాటలో కథ జరుగుతుంది. అందరూ కష్టపడి ఈ సినిమాకి వర్క్‌చేశారు. ప్రేక్షకుల‌ తీర్పు కోసం ఎదురు చూస్తున్నాం’’ అన్నారు. పాటల‌ రచయిత వేదవ్యాస్‌ మాట్లాడుతూ ` ‘‘ఈ సినిమాలో పాటలు రాసే అవకాశం ఇచ్చిన రాఘవేంద్రరావు గారికి థాంక్స్‌. అందరి హృదయాల‌ను దోచుకోవడానికి ఈ సినిమా వస్తోంది’’ అన్నారు.
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*