పార్టీ డబ్బులపై ‘‘పవర్’’ నాదేనన్న పన్నీర్



Want create site? Find Free WordPress Themes and plugins.
panner selvamఅన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు వ్యతిరేకంగా ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వం పూర్తిస్థాయిలో దూకుడు పెంచారు. ఒకదాని తరువాత ఇంకో షాక్ ఇస్తూ శశికళను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.  తాజాగా పార్టీ డబ్బులపై పూర్తి పెత్తనం తనదేనంటూ బాంబు పేల్చారు. పార్టీ కోశాధికారి పదవి నుంచి తనను తప్పించడం పార్టీ నిబంధనల ప్రకారం అక్రమం అని.. తన బహిష్కరణ చెల్లదు కాబట్టి తానే కోశాధికారినని ఆయన ప్రకటించారు. అంతేకాదు.. తన అనుమతి లేకుండా పార్టీ ఖాతాలోంచి డబ్బులు తీసుకోవడానికి అనుమతించవద్దని బ్యాంకులకు లేఖలు రాశారు. అన్నాడీఎంకే రాజ్యాంగం ప్రకారం జయలలిత తనను కోశాధికారిగా నియమించారని, తన లిఖిత పూర్వక అనుమతి, సూచనలు లేకుండా పార్టీ ఖాతాల ద్వారా లావాదేవీలు నిర్వహించేందుకు ఎవరికీ అనుమతి ఇవ్వవద్దని కరూర్ వైశ్యాబ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్లను ఆ లేఖల్లో కోరారు. దీంతో శశికళ ఆటలకు కళ్లెం వేసేందుకు పన్నీర్ పూర్తిస్థాయిలో ఆట మొదలుపెట్టినట్లు కనిపిస్తోంది. మరోవైపు పన్నీర్ కు మద్దతు పలుకుతున్న నేతలు కూడా శశికళ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. సవాళ్లు విసురుతున్నారు.  మాజీ మంత్రి కేపీ మునుస్వామి కూడా శశిపై విరుచుకుపడ్డారు. ఆమెకు సవాలు విసిరారు. జయలలిత పోటీ చేసి విజయం సాధించిన ఆర్కే నగర్ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికలో బరిలోకి దిగి విజయం సాధించాలని సవాల్ చేశారు. జయ అనారోగ్యానికి, ఆమె మృతికి మన్నార్‌గుడి మాఫియానే కారణమని ఆరోపించారు. ‘అమ్మ’లాగా వస్త్రధారణ చేసుకున్నంత మాత్రాన ప్రజలు ఆమెను సీఎంగా అంగీకరించరని అన్నారు. అవినీతి కేసులో తప్పకుండా ఆమెకు వ్యతిరేకంగానే తీర్పు వస్తుందని ఆయన జోస్యం చెప్పారు.
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*