నంద‌మూరి వార‌సులతో మ‌ల్టీస్టార‌ర్‌….



Want create site? Find Free WordPress Themes and plugins.
KALYAN-RAMమ‌ల్టీస్టార‌ర్ సినిమాల‌కు బ్లాక్ అండ్ వైట్ నుంచి డిజిట‌ల్ కాలం వ‌ర‌కు ప్ర‌జ‌లు ఎప్పుడు ఆద‌రిస్తూనే ఉన్నారు. ఇద్ద‌రు స్టార్ హీరోల‌కు స‌మాన పాత్ర‌లు ఇస్తూ సినిమా రూపొందించాలంటే క‌త్తి మీద సాము. దీనికి తోడు ఒకే కుటుంబానికి చెందిన వార‌సుల‌ను తెర మీద చూపించాలంటే సాహ‌సంతో కూడుకున్న ప‌నే అవుతుంది. కాని అక్కినేని ఫ్యామిలీతో మ‌నం సినిమా తీసి విక్ర‌మ్ విజ‌యం సాధించాడు.   తాజాగ‌   నిర్మాత, ఎంపీ టి. సుబ్బిరామి రెడ్డి  మెగాబ్ర‌ద‌ర్స్ చిరంజీవి, ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌తో సినిమా  ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనితో పాటుగా నందమూరి ఫ్యామిలీ మల్టీస్టారర్ కూడా త్వరలోనే పట్టాలెక్కనున్న‌ది. ఓ పక్క తమ్ముడు ఎన్టీఆర్‌ హీరోగా నిర్మించబోయే సినిమా పనులతో బిజీగా ఉన్న నందమూరి కళ్యాణ్‌రామ్‌.. మరోపక్క తాను హీరోగా నటించనున్న ఈ మల్టీస్టారర్  కోసం కథలు వింటున్నాడట. పలు కధలు విన్న ఆయన దర్శకుడు పవన్‌ సాధినేని చెప్పిన కధ బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశాడని సమాచారం. ‘ప్రేమ ఇష్క్‌ కాదల్‌’, ‘సావిత్రి’ చిత్రాలకు దర్శకత్వం వహించిన  పవన్‌ సాధినేని చెప్పిన కథకి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టేశారని తెలుస్తోంది. మెగా బ్ర‌ద‌ర్స్‌, నంద‌మూరి వార‌సుల సినిమాలు చూసి ఎంజాయ్ చేయ‌డానికి ప్రేక్ష‌కులు సిద్ద‌మైపోవాలి ఇక‌.
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*