’పౌరాణికం’లో యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌



Want create site? Find Free WordPress Themes and plugins.

NTR-Hiranyakashyapaనటుడు ఎన్ని విజయాలు సాదించిన ఒక్కసారి పౌరాణిక గెటప్‌లో కనిపించాలని కోరుకుంటారు. కాని ఇలాంటి పాత్రలు చేయడమంటే ఆషామాషి కాదు. బ్లాక్‌ అండ్‌ వైట్‌ నుంచి ఈస్ట్‌మెన్‌ కలర్‌ వరకు రాముడు, భీముడు, కృష్ణుడు ఇలా ఏ వేషం వేయాలన్నా అది స్వర్గీయ ఎన్‌టిఆర్‌కే సాద్యమైంది. ఆ తరువాత శోభన్‌బాబు రాముడు పాత్రలో రెండు సినిమాల్లో నటించారు. కాని అంతలా పేరు రాలేదు. ఎన్‌టిఆర్‌ నెగటీవ్‌ రోల్స్‌లో చేసిన దుర్యోదనుడి పాత్రకు కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఆ తరువాత ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ కృష్ణుడు, రాముడు పాత్రల్లో మెప్పించారు. ఇప్పుడు పౌరాణిక ఇతిహాసంలో ఓ సినిమా తెరకెక్కించేందుకు ప్రయత్నిస్తున్నారు దర్శకుడు గుణశేఖర్‌. రాణి రుద్రమదేవి సినిమాను తీసి శభాష్‌ అనిపించుకున్నగుణశేఖర్‌ సినిమాలకు కొంత గ్యాప్‌ఇచ్చారు. ఇప్పుడు కొత్త కథను సిద్దం చేస్తున్నాడు. పురాణాల్లో హిరణ్యకశ్యప కథ గురించి వినే ఉంటారు. ఇది నలభై సంవత్సరాల క్రితం సినిమా రూపంలో కూడా వచ్చింది. ఈ కథకే కొంత మెరుగులు దిద్ది లేటెస్ట్‌ గ్రాఫిక్స్‌తో ప్రేక్షకుల ముందుకు తేవాలని గుణశేఖర్‌ ఆలోచిస్తున్నారు. టైటిల్‌ రోల్‌ క్యారెక్టర్‌ ఎవరైతే మేలు అని ఆయన మదనపడ్డాడట. అప్పుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన యమదొంగ జ్ఞప్తికి వచ్చింది. పౌరాణిక వేషదారణలో యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ డౌట్‌ అంటూ తొడ కొట్టిన సీన్‌ ఇప్పటికి ప్రేక్షకులకు గుర్తుంది. అయితే జూనియర్‌నే పెడదామని ఫిక్స్‌ అయ్యాడు. జనతాగ్యారేజీ తరువాత కళ్యాణ్‌నిర్మాణ సారధ్యంలో తెరకెక్కనున్న జై లవకుశ సినిమా కోసం సిద్దమవుతున్న ఎన్టీఆర్‌ను గుణశేఖర్‌ కలిసి కథ గురించి చెప్పాడు. ఇంకా రెండు సిట్టింగ్‌లు జరిగితే పాత్రపై క్లారీటీ వచ్చాక జూనియర్‌ ఎన్‌టిఆర్‌ ఓకే చెబుతాడా లేదా అని సినిమా వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఇప్పటి కాలంలో పౌరాణిక సినిమా తీయడమే ఓ సాహసం…..అందులో నటించడం ఇంకా పెద్ద సవాలే అవుతుంది. పౌరాణిక పాత్రలంటే తనకు మోజు ఉందని జూ ఎన్టీఆర్‌ గతంలో చెప్పాడు….మరి ఈ సబ్జెక్ట్‌ గురించి ఏమంటాడో వేచి చూడాల్సిందే….!

Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*