తెంపరి ట్రంప్ వెనకడుగు వేసిన వేళ..



Want create site? Find Free WordPress Themes and plugins.

trumpమెజార్టీ ముస్లింలున్న ఏడు దేశాల నుంచి అమెరికాకు వచ్చే వారిపై ట్రంప్ సర్కారు వేసిన బ్యాన్ వేటుపై తాత్కాలిక స్టే ఇస్తూ సియాటిల్ జిల్లా జడ్జి జేమ్స్ రాబర్ట్ జారీ చేసిన ఉత్తర్వులు అమెరికా వ్యాప్తంగా అమలవుతాయన్న ఆదేశాలు జారీ చేశారు. దీంతో.. కోర్టు ఆదేశాల్ని అమెరికా అధ్యక్షుడైనా కట్టుబడి ఉండాల్సిందేనన్న వ్యాఖ్యల నేపథ్యంలో ట్రంప్ సైతం సరేనని అనక తప్పని పరిస్థితి.

ఇదిలా ఉండగా.. తెంపరి ట్రంప్ ఆదేశాలపై కోర్టు ఇచ్చిన బ్యాన్ కారణంగా కొన్ని సానుకూల పరిణామాలు చోటుచేసుకున్నాయి. బ్యాన్ ఎదుర్కొంటున్న ఇరాన్ నుంచి వచ్చే వారిని అమెరికాలో అడ్డుకోకుండా కోర్టు ఆదేశాల కారణంగా.. ఆ దేశానికి చెందిన నాలుగు నెలల చిన్నారి అమెరికాలోకి అడుగుపెట్టే అవకాశం లభించింది. గుండెకు శస్త్రచికిత్స అత్యవసరమైన వేళలో అమెరికాలో వైద్యం చేయించుకునేందుకు ఇరాన్ కు చెందిన చిన్నారి కుటుంబం ఎంతో ప్రయత్నించింది. ఇందుకోసం వారు పోర్ట్ ల్యాండ్ నుంచి అమెరికాలోకి వచ్చేప్రయత్నం చేశారు.

lawyers-at-jfkఅయితే.. దీన్ని అడ్డుకట్ట వేస్తూ ట్రంప్ ఆదేశాల్ని అధికారులు చూపించి.. అమెరికాలోకి అనుమతించలేదు. తాజాగా కోర్టు ఆదేశాల నేపథ్యంలో ట్రంప్ ఆదేశాలు వెనక్కి వెళ్లిపోయాయి. దీంతో.. శస్త్రచికిత్స అవసరమైన చిన్నారిని అమెరికాలోకి అనుమతించారు. తాజాగా ఆ పాపకు మాన్ హటన్ లోని మౌంట్ సినాయ్ ఆసుపత్రి ఉచితంగా శస్త్రచికిత్స చేయనుండటం గమనార్హం.

ఇదిలా ఉంటే.. తాను స్వయంగా జారీ చేసిన ఆదేశాల్ని సియాటిల్ జిల్లా కోర్టు ఇచ్చిన తాత్కాలిక స్టే పై ట్రంప్ తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. ఆ స్టే ఆదేశాల్ని ఎట్టిపరిస్థితుల్లో అయినా రద్దు చేయిస్తామని వ్యాఖ్యానించారు.అంతేకాదు.. న్యాయమూర్తి అభిప్రాయం కామెడీగా ఉందన్న ఆయన.. దేశ చట్టబద్ధ పాలనను దేశం వెలుపలికి తీసుకెళ్లేలా ఉందంటూ పిడివాదనను వినిపించారు.

Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*