చిరు వాయిస్‌ ఓవర్‌ తో ’ఘాజీ ’ టీజర్‌ విడుదల



Want create site? Find Free WordPress Themes and plugins.

Rana-Ghazi-Movie-Wallpapers-1బాహుబలి తరువాత దగ్గుబాటి రానా ఘాజీ సినిమాలో నటిస్తున్నారు. పాకిస్థాన్‌తో జరిగిన యుద్దంలో సబ్‌మెరైన్‌ ఆదృశ్యం నేపథ్యంలో తీస్తున్న ఈ సినిమా హిందీ, తెలుగు,తమిళంలో ఒకే పారి విడుదల కానున్నది. ఘాజీ షూటింగ్‌ సమయంలో సంచలనం సృష్టించింది. సినిమాకు వాయిస్‌ ఓవర్‌లు ప్రముఖ నటులు ఇవ్వడమే ఇందుకు కారణం, హిందీలో అమితాబ్‌, తమిళం సూర్య వాయిస్‌ ఓవర్‌ఇచ్చారు. ఇక తెలుగు విషయానికి వస్తే మెగాస్టార్‌ చిరంజీవి వాయిస్‌ ఓవర్‌ చెప్పారు. చిరు ఈ పేరు వింటేనే ప్రేక్షకులు పులకరించిపోతారు. ఏకంగా ఆయనే వాయిస్‌ ఓవర్‌ ఇచ్చాడంటే ఇక ఆగుతారా. ఈ క్రేజ్‌ను సినిమా ప్రమోషన్‌ కింద మార్చుకున్నారు. ఘాజీ నిర్మాతలు, విశాఖపట్నంలో జరిగిన ఓ కార్యక్రమంలో చిరంజీవి వాయిస్‌ ఓవర్‌తో కూడిన టీజర్‌ను విడుదల చేశారు. ఇప్పటి వరకు ఇండియా, పాకిస్థాన్‌లు నాలుగు సార్లు యుద్దంలో తలపడ్డాయి….కాని అందరికీ తెలియని యుద్దం విశాఖపట్నం సముద్ర గర్భంలో జరిగింది……అంటూ చిరు వాయిస్‌తో విడుదల చేసిన టీజర్‌ ఆకట్టుకునేలా ఉంది.

Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*