గ్రామీణ ప్రాంతాల్లో ఏపీఎన్‌ఆర్‌టి సేవలు అభినందనీయం: రాయపాటి



Want create site? Find Free WordPress Themes and plugins.

download (1)

గ్రామీణ ప్రాంతాల అవసరాలు తెలుసుకొని అందుకనుగుణంగా సేవలు నిర్వహిస్తున్న ఏపీఎన్‌ఆర్‌టి కృషి అభినందనీయమని ఎంపి రాయపాటి సాంబశివరావు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ నాన్‌ రెసిడెన్షియల్‌ తెలుగు సొసైటీ (ఏపీఎన్‌ఆర్‌టి) ఆధ్వర్యంలో శనివారం ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గంలోని కాకుమాను మండలం కొండబాల వారి పాలెంలో నూతనంగా ఏర్పాటుచేసిన ఈ మెడికల్‌ క్లీనిక్‌ సెంటర్‌ను మరియు ఉచిత మెగా వైద్యశిబిరాన్ని రాయపాటి ప్రారంభించారు. ఇ క్లీనిక్‌లో టెలిమీడియా ద్వారా రోగులకు అందించే వైద్య విధానాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విదేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రుల సహకారంతో గ్రామాల అభివృద్ధికి తోడ్పడటం శుభ పరిణామమన్నారు. ఏపీఎన్‌ఆర్‌టి తరఫున గ్రామంలో ఇ క్లీనిక్‌ ని ఏర్పాటు చేసి టెలీమెడిసన్‌ ద్వారా వైద్యం చేయడం గొప్ప విషయమన్నారు. ఇ క్లీనిక్‌ ని ఏర్పాటు చేయించిన ఏపీఎన్‌ఆర్‌టి సీఈవో వేమూరి రవికుమార్‌ను ఎంతగానో అభినందిస్తున్నట్టు చెప్పారు. ఏదైన వ్యాధి సోకితే దానికి చికిత్స నిర్వహించుకోవాలంటే ఖర్చుతో కూడుకోవడంతో పేదలు వెనుకడుగు వేస్తున్నారన్నారు. ఏపీఎన్‌ఆర్‌టి సొసైటీ గ్రాహీణ ప్రాంతాల్లో ఉన్న పేదవారికి ఉచితంగా వైద్యపరీక్షలు నిర్వహించడంతో మందులు పంపిణీ చేశారని వీరిని ఆదర్శంగా తీసుకొని మరికొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నరసరావుపేట పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఇంకా అనేక వెనుకబడ్డ గ్రామాలున్నాయని అక్కడ కూడా సేవలందించేందుకు ఏపీఎన్‌ఆర్‌టి ముందుకు రావాలని కోరారు. డాక్టర్‌ రవికుమార్‌ మాట్లాడుతూ విదేశాల్లో 40 లక్షల మంది ప్రవాసాంధ్రులు ఉన్నారని, తాము ఇ క్లీనిక్‌ ఏర్పాటు చేసి రాష్ట్రంలో గ్రామాల అభివృద్దికి కృషి చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్టుచెప్పారు. గ్రామాల్లోని పేదలు వైద్యం చేయించుకోలేక తీవ్ర ఇబ్బందుల పడుతున్నారని అందుకనే ఇ క్లీనిక్‌ లను ఏర్పాటు చేసి తమ వంతు సహకారం అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలోనే తొలిసారిగా ఇ క్లీనిక్‌ని ఈ గ్రామంలో ఏర్పాటు చేశామన్నారు. ఆరోగ్యశ్రీ వర్తించని కుటుంబాలకు ఆరోగ్య రక్ష పథకం కింద ఒక సంవత్సరానికి తమ ఎన్‌ఆర్‌టి  తరఫున బీమాప్రీమియం చెల్లిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సోసైటీ ముఖ్య సమన్వయకర్త బుచ్చి రాంప్రసాద్‌, డైరెక్టర్‌ (ఆపరేషన్స్‌) ప్రసాద్‌పుల్ల, మీడియా కో ఆర్డినేటర్‌ సాగర్‌ దొడ్డపనేని, విలేజ్‌ స్పెషల్‌ ఆఫీసర్‌డాక్టర్‌ నిరంజన్‌ మోతురి, ఎంపి పి. శైలజ , సర్పంచ్‌ లక్ష్మీ, ఎంపిటీసీ శివకుమారి తదితరులు పాల్గొన్నారు.

Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*