రష్మీ, సుధీర్‌ మధ్య ఏముందంటే…!



Want create site? Find Free WordPress Themes and plugins.

147304’జబర్ధస్త్‌ ’ కామెడీ షో గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారంటూ ఉండరు. కడుపుబ్బ నవ్వేలా చేసే స్కిట్స్‌ షో రేటింగ్స్‌ను అమాంతం పెంచేసాయి. పంచ్‌ డైలాగులు, సెటైర్‌లు కామెడీని పండిస్తున్నాయి. 45 నిమిషాల పాటు నాన్‌ స్టాప్‌గా నవ్వించే ఈ కామెడీ షోకు లక్షల మంది అభిమానులున్నారంటే అతిశయోక్తి కాదు. కేవలం యూ ట్యూబ్‌లో ఈ షోలను చూసే వారి సంఖ్య పది లక్షలకు పైగా ఉంటుంది. జబర్ధస్ట్‌ వేదికపై ఎంతో మంది హస్య నటులు తమ ప్రతిభను కనబరిచారు. వీరిలో చాలా మంది సినిమాల్లో హస్య నటులుగా బీజీ అయ్యారు. ఇలా బీజీ అయిన టీం లీడర్‌లలో సుడిగాలి సుధీర్‌ ఒకడు. జబర్దస్త్‌తో అవకాశాలు అందిపుచ్చుకుని మంచి ఫామ్‌లో ఉన్నాడు. అతనికి అమ్మాయిలతో లింకులున్నాయంటూ వేసే సెటైర్‌లు కామెడీని పండించాయి. అంతే కాదు జబర్ధస్త్‌ తో మంచి పేరు తెచ్చుకున్న రష్మీ కూడా సినిమాలలో అవకాశాలు దక్కించుకుంటుంది. సుదీర్‌, రష్మీల మధ్య ఎఫైయిర్‌ నడుస్తున్నట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సోషల్‌ మీడియాలో వీరి గురించి అనేక కామెంట్‌లు వినిపిస్తాయి. ఈ విషయం రష్మీని అడిగినప్పుడల్లా నవ్వి ఊరుకుంది తప్పితే ఎక్కడ ఖండించకపోవడంతో నిజమే అనుకున్నారు. అయితే తనకు రష్మీ మధ్య ఎఫైయిర్‌ ఉన్నట్టు కొన్ని స్కిట్స్‌లో హాస్యం కోసం ఉపయోగించుకున్నామని వాస్తవంలో వీరి మధ్య ఏం లేదంట. ఈ విషయాన్సి సుదీరే స్వయంగా చెప్పాడు. సరదా కోసం చేసిన స్కిట్‌లకు ప్రేక్షకులు కనెక్ట్‌ అయిపోయారని చెప్పకొచ్చాడు. తాను భగ్న ప్రేమికుడినని అందరూ అనుకుంటున్నారని అసలు ఇంత వరకు ఎవరిని ప్రేమించలేదని స్పష్టం చేశాడు. కేరీర్‌పైనే దృష్టి పెట్టినట్టు చెప్పారు. పెళ్లికి ఇంకా సమయం ఉందంటూ వెల్లడించాడు. మొత్తానికి బుల్లితెరలో హాట్‌టాపిక్‌గా ఉన్న రష్మీ, సుదీర్‌ ఎఫైయిర్‌ విషయానికి ఫుల్‌స్టాప్‌ పడ్డట్టే అనుకుందాం..!

Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*