నిలకడగా దాసరి ఆరోగ్యం



Want create site? Find Free WordPress Themes and plugins.

Dasari-Narayana-Rao-hospitalized

అస్వస్థతకు గురై మూడు రోజులుగా సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆసుపత్రిలో చేరిన దాసరి నారాయణరావుఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. లంగ్స్‌ పనితీరు బాగానే ఉందని, వెంటిలేటర్‌ సపోర్ట్‌ ఇస్తున్నట్టు తెలిపారు. ఇంకా నాలుగు రోజుల పాటు ఐసీయులో ఉంచుతామని వైద్యులు కృష్ణకుమార్‌, ప్రభాకర్‌లు దాసరి ఆరోగ్యం పై విడుదల చేసిన బుల్లెటన్‌లో పేర్కొన్నారు. ఘన ఆహారం కాకుండా ఫ్లూయిడ్స్‌ మాత్రమే ఇస్తున్నట్టు , మదుమేహం కూడా ఉంటంతో దాన్ని నియంత్రించే పనిలో పడ్డట్టు తెలిపారు. ట్రాసియాటమీ తీస్తే దాసరి మాట్లాడగలుగుతారని వెల్లడించారు. ఇదిలా ఉండగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దాసరిని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఎంపీ సుబ్బిరామిరెడ్డి, సినీ నటుడు మోహన్‌ బాబు తదితరులు ఉన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు.

Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*