నాటా నూతన కార్యవర్గం ఎన్నిక



Want create site? Find Free WordPress Themes and plugins.

ఉత్తమ అమెరికా సమితి (నాటా) నూతన కార్యవర్గ సమావేశం లాస్‌ వేగాస్‌లో జరిగింది. నూతన అధ్యక్షునిగా రాజేశ్వర్‌రెడ్డి గంగసాని ప్రమాణ స్వీకారం తరువాత బోర్డు సభ్యులు ప్రెసిడెంట్‌ ఎలెక్ట్‌గా డాక్టర్‌ రాఘవరెడ్డి గోసల, ఎగ్జిక్యూటీవ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ శ్రీధర్‌రెడ్డి కొర్సపాటి, సెక్రటరీగా శ్రీకాంత్‌రెడ్డి పెనుమాడ, ట్రెజరర్‌గా చిన్నబాబురెడ్డి, జాయింట్‌ సెక్రటరీగా అన్నారెడ్డి, జాయింట్‌ ట్రెజరర్‌గా శ్రీనివాస్‌వంగిమళ్ల, ఇంటర్నేషనల్‌ వైస్‌ ప్రసిడెంట్స్‌ గా సాంబరెడ్డి, ప్రతాప్‌ భీమిరెడ్డి, శ్రీనివాస్‌ గనగోని, నేషనల్‌కన్వెన్షన్‌ అడ్వైజర్‌ గా బాల ఇందుర్తిలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అడ్వైజరీ కౌన్సిల్‌ ఛైర్మెన్‌ డాక్టర్‌ ప్రేమ్‌రెడ్డి మాట్లాడుతూ తెలుగు సంస్థలైన ఆట, టాటా లతో కలిసి 2018లోఫిలడెల్పిఆలో మెగా కన్వెన్షన్‌ నిర్వహించడానికి సూత్రప్రాయంగా ప్రయత్నాలు మొదలయ్యాయన్నారు. ఇందుకు అన్ని సంఘాలు తమ మద్దతును ప్రకటించాయని పేర్కొన్నారు. అధ్యక్షుడు మోహన్‌ మల్లం , రాఘవరెడ్డిలు మాట్లాడుతు రెండు సంవత్సరాల్లో 2,300 కుటుంబాలు నాటా సభ్యత్వం తీసుకున్నాయన్నారు. దీనికి బోర్డు సభ్యులు, కమిటీ ఎంతోకృషి చేసిందన్నారు. ఇండియా నుంచి వచ్చిన డాక్టర్‌ ధ్వారకానాథ్‌రెడ్డి, జీబీకె మూర్తికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. నాటా నాయకులు రమేష్‌ అప్పారెడ్డి, సంజీవరెడ్డి, ప్రసాద్‌ జీ రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, ఆళ్లరామిరెడ్డి, డాక్టర్‌ రామిరెడ్డి బూచిపూడి, కిరణ్‌ గుణ్ణం, రవి కందిమల్ల, జయచంద్రారెడ్డి, సంధ్యరెడ్డి, పద్మమల్లం, డాక్టర్‌ విజయలక్ష్మీ, అప్పారెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*